Viral Video: అటూ ఇటూ తిప్పి కింగ్ కోబ్రానే తికమకపెట్టారు.. ఆదమరచి ఉన్న సమయంలో.. చివరికి అతడు చేసిన పని చూడండి..

ABN , First Publish Date - 2023-07-30T21:20:02+05:30 IST

అత్యంత విషపూరితమైన పాముల్లో కింగ్ కోబ్రా ఒకటి. చూస్తేనే ఒళ్లు జలదరించే ఈ పాము జోలికి వెళ్లాలంటే.. ప్రాణాల మీద దాదాపు ఆశలు వదులుకోవాల్సిందే. అలాంటిది కొందరు ఇలాంటి పాములతో కూడా పరాచకాలు ఆడుతుంటారు. చూసేందుకు ఇది సరదాగా అనిపించినా అప్పుడప్పుడూ ...

Viral Video: అటూ ఇటూ తిప్పి కింగ్ కోబ్రానే తికమకపెట్టారు.. ఆదమరచి ఉన్న సమయంలో.. చివరికి అతడు చేసిన పని చూడండి..

అత్యంత విషపూరితమైన పాముల్లో కింగ్ కోబ్రా ఒకటి. చూస్తేనే ఒళ్లు జలదరించే ఈ పాము జోలికి వెళ్లాలంటే.. ప్రాణాల మీద దాదాపు ఆశలు వదులుకోవాల్సిందే. అలాంటిది కొందరు ఇలాంటి పాములతో కూడా పరాచకాలు ఆడుతుంటారు. చూసేందుకు ఇది సరదాగా అనిపించినా అప్పుడప్పుడూ అసలుకే ఎసరు వస్తుంటుంది. ఇది తెలిసినా చాలా మంది వాటితో ఆటలు ఆడుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు వ్యక్తులు కలిసి.. కింగ్ కోబ్రాను అటూ ఇటూ తిప్పుతూ తికమకపెట్టారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ అటవీ ప్రాంతంలో ఇద్దరు యువకులకు కింగ్ కోబ్రా (King Cobra) తారసపడుతుంది. దాని దారిన అది వెళ్తుండగా.. యువకులు అక్కడికి వెళ్లి తోక పట్టుకుని వెనక్కు లాగారు. దీంతో పడగ విప్పి వారి పైకి బుసకొట్టింది. అయినా వారు పామును వదలకుండా చాలా సేపు ఇబ్బంది పెట్టారు. ఒకరు వెనుక వెపు నుంచి తోక పట్టుకుని లాగుతుంటే, ఇంకొకరు ముందు వైపు నుంచి పామును తికమెక పెట్టారు. ఎన్నిసార్లు కాటు వేయాలని ప్రయత్నిస్తున్నా దాని నుంచి తెలివిగా తప్పించుకుంటూ పామును ఇబ్బంది పెట్టారు.

Viral Video: ఈ మేకలు ఉన్నది భూమి మీద కాదు.. ఉప్పు కోసం ఇవి ఎలాంటి సాహసం చేశాయో చూస్తే.. కళ్లు బయర్లు కమ్మాల్సిందే..

ఇలా చాలా సేపు ఇబ్బంది పెట్టడంతో పాము కాసేపు సైలెంట్‌గా ఉండిపోయింది. దీంతో ఓ యువకుడు మెల్లగా (young man kissed the snake) పాము తలపై ముద్దు పెట్టాడు. ఈ ఘటనను మొత్తం మరో వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘జీవహింస మహా పాపం’’.. అంటూ కొందరు, ‘‘ఇలా చేయడం చాలా ప్రమాదం’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి ఘటనలు మరోసారి జరక్కుండా చర్యలు తీసుకోవాలి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వేలల్లో లైకులను సొంతం చేసుకుంది.

Smart phone: ఇతడి ఫోన్ పాస్‌వర్డ్ గుర్తు పెట్టుకోవడం.. కంప్యూటర్‌కీ సాధ్యం కాదేమో.. ఎలా అన్‌లాక్ చేస్తున్నాడో మీరే చూడండి..

Updated Date - 2023-07-30T21:25:05+05:30 IST