హోలీ వేడుకల తర్వాత స్నానానికి బాత్రూంకు వెళ్లిన భార్యాభర్తలు.. గంటయినా బయటకు రావడం లేదని పిల్లలు వెళ్లి పక్కింటోళ్లకు చెప్తే..!
ABN , First Publish Date - 2023-03-09T16:43:03+05:30 IST
ఆ దంపతులు.. 14ఏళ్ల కూతురు, 12ఏళ్ల కొడుకుతో సంతోషంగా జీవిస్తుండేవారు. అందులోనూ వీరికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కూడా లేవు. ఆనందంగా సాగుతున్న వీరి కుటుంబంలో ఇటీవల ఊహించని ఘటన చోటు చేసుకుంది. చుట్టు పక్కల వారితో..
ఆ దంపతులు.. 14ఏళ్ల కూతురు, 12ఏళ్ల కొడుకుతో సంతోషంగా జీవిస్తుండేవారు. అందులోనూ వీరికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కూడా లేవు. ఆనందంగా సాగుతున్న వీరి కుటుంబంలో ఇటీవల ఊహించని ఘటన చోటు చేసుకుంది. చుట్టు పక్కల వారితో సంతోషంగా హోలీ వేడుకలు చేసుకున్న ఈ దంపతులు సాయంత్రం స్నానం చేయడానికి వెళ్లారు. గంటయినా బయటకు రాకపోవడంతో పిల్లలు వెళ్లి పక్కింటోళ్లకు చెప్పారు. చివరకు ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఘజియాబాద్ పరిధి మురాద్‌నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీపక్ గోయల్ (40), శిల్పి (36) దంపతులు (couple).. 14ఏళ్ల కూతురు, 12ఏళ్ల కొడుకుతో కలిసి స్థానిక అగ్రసేన్ కాలనీలో నివాసం ఉండేవారు. దీపక్ కొన్ని నెలల క్రితం స్థానికంగా ఓ కెమికల్ ఫ్యాక్టరీని (Chemical factory) ప్రారంభించాడు. ఇదిలావుండగా, హోలీ సందర్భంగా (Holi celebrations) ఈ దంపతులు చుట్టుపక్కల వారితో బుధవారం సరదాగా ఎంజాయ్ చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ పిల్లలతో సరదా సరదాగా గడిపారు. తర్వాత 4గంటల ప్రాంతంలో స్నానం (bath) చేసేందుకు దంపతులిద్దరూ బాత్రూంకి వెళ్లారు. అయితే ఎంతకీ బయటికి రాలేదు. దీంతో పిల్లలకు అనుమానం వచ్చి తలుపు తట్టారు. లోపలి నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో ఇరుగుపొరుగు వారికి చెప్పారు.
భార్యను తండ్రి గదిలోకి పంపించాలని భర్త ప్రయత్నం.. ఓ రోజు ఇదే విషయాన్ని ఆమెకు చెప్పి.. చివరకు..
అక్కడికి చేరుకున్న స్థానికులు.. తలుపులు తట్టినా వారు మాత్రం తీయలేదు. చివరకు బద్దలు కొట్టి చూడగా లోపల దంపతులిద్దరూ అపస్మారక స్థితిలో (Unconscious couple) పడి ఉన్నారు. దీంతో వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మృతి (died) చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాత్రూంలోని గీజర్ వద్ద అగ్ని ప్రమాదం (geyser accident) జరిగినట్లు గుర్తించారు. దీనిపై వైద్యులు మాట్లాడుతూ గీజర్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ (Carbon monoxide) ఎక్కువగా వెలువడిందన్నారు. దీనివల్ల గుండె మరియు మెదడుకు అవరసరమైన ఆక్సిజన్ అందదని, ఈ కారణంగానే దంపుతులు మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాలను పోస్టమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Viral Video: అర్ధరాత్రి లారీల మధ్యలో.. యువతిని పట్టుకుని ఈ పోలీసు చేస్తున్న పని చూస్తే.. ఛీకొడతారు..