Share News

Viral Video: నీ టాలెంట్‌కు సలాం తల్లీ.. సైకిల్ తొక్కుతూనే స్కిప్పింగ్ చేసిన యువతి..!

ABN , First Publish Date - 2023-10-18T16:58:08+05:30 IST

సాధారణానికి భిన్నంగా కొందరు చేసే పనులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. అలాగే మరికొందరు ఒకేసారి రెండు పనులు చేస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఇటీవల మహిళలు కూడా వివిధ రకాల ప్రయోగాలు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. తాజాగా...

Viral Video: నీ టాలెంట్‌కు సలాం తల్లీ.. సైకిల్ తొక్కుతూనే స్కిప్పింగ్ చేసిన యువతి..!

సాధారణానికి భిన్నంగా కొందరు చేసే పనులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. అలాగే మరికొందరు ఒకేసారి రెండు పనులు చేస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఇటీవల మహిళలు కూడా వివిధ రకాల ప్రయోగాలు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఓ యువతి చేసిన విన్యాసం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. సదరు ఓ వైపు సైకిల్ తొక్కుతూనే మరోవైపు వెరైటీగా స్కిప్పింగ్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘నీ టాలెంట్‌కు సలాం తల్లీ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతోంది.

సోషల్ మీడియాలో ఓ యువతి వీడియో (Viral video) వైరల్ అవుతోంది. ఖాళీగా ఉన్న రోడ్డు పైకి ఓ యువతి సైకిల్ తొక్కుకుంటూ వచ్చింది. ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా.. సైకిల్ తొక్కుతూనే మరోవైపు స్కిప్పింగ్ (Young woman skipping while riding bicycle) కూడా చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం దసర శరన్నవరాత్రుల సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గుజరాత్ తదితర రాష్ట్రాల్లో గార్బా వేడుకలు నిర్వహిస్తుంటారు. మహిళలంతా ఘాగ్రా, చోలీతో పాటూ వెండి ఆభరణాలు ధరించి నృత్యం చేస్తుంటారు.

Woman: అత్యాచారం కేసు పెట్టి.. ఆ తర్వాత సడన్‌గా మాట మార్చేసిన మహిళ.. క్షమించి వదిలేస్తారనుకుంటే ఊహించని షాకిచ్చిన హైకోర్టు..!

ఈ ఉత్సవాలను పురస్కరించుకుని సదరు యువతి కూడా వినూత్నంగా ఘాగ్రా, చోలీ ధరించి విన్యాసం చేసింది. సైకిల్ హ్యాండిల్‌ను వదిలేసి చేతిలో తాడు పట్టుకుని.. సైకిల్ ముందు టైరు నుంచి వెనుక టైరు కింద నుంచి పైకి వచ్చేలా స్కిప్పింగ్ చేసింది. అలాగే స్కిప్పింగ్ చేస్తూ చాలా దూరం వెళ్లింది. ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుండా ఆమె చేసిన విన్యాసం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘వావ్! ఈ యువతి టాలెంట్ అద్భుతం’’.. అని కొందరు, ‘‘సాంప్రదాయ వస్త్రధారణలో స్కిప్పింగ్ సూపర్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: డ్రైవర్ లేకుండానే దూసుకెళ్తున్న బస్సు.. ఇంజిన్ ముందు వైపు చూస్తే అవాక్కవడం ఖాయం..

Updated Date - 2023-10-18T16:58:08+05:30 IST