Love: చచ్చిపోయినా బాగుండేదంటూ అతడు బాధ పడుతోంటే.. వెతుక్కుంటూ వచ్చి పెళ్లి చేసుకున్న యువతి.. అంతా వద్దంటున్నా..!
ABN , First Publish Date - 2023-07-28T16:49:13+05:30 IST
కొన్ని వివాహాలు తీరా పెళ్లి పీటల వరకూ వచ్చి ఆగిపోతుంటాయి. వివిధ కారణాలు చూపుతూ వధూవరుల్లో ఎవరో ఒకరు తమ పెళ్లిని ఉన్నట్టుండి రద్దు చేసుకుంటుంటారు. ఇలాంటి ఘటనలు ఇటీవల తరచూ చోటు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. అయితే ప్రస్తుతం ఓ యువతి తీసుకున్న నిర్ణయం చూసి...
కొన్ని వివాహాలు తీరా పెళ్లి పీటల వరకూ వచ్చి ఆగిపోతుంటాయి. వివిధ కారణాలు చూపుతూ వధూవరుల్లో ఎవరో ఒకరు తమ పెళ్లిని ఉన్నట్టుండి రద్దు చేసుకుంటుంటారు. ఇలాంటి ఘటనలు ఇటీవల తరచూ చోటు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. అయితే ప్రస్తుతం ఓ యువతి తీసుకున్న నిర్ణయం చూసి నెటిజన్లు.. ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. పెళ్లికి సరిగ్గా నెల రోజుల ముందు జరిగిన ప్రమాదంలో వరుడి ముఖం కాలిపోయింది. చచ్చిపోయినా బాగుండేదంటూ అతడు బాధ పడుతోంటే.. యువతి అతన్ని వెతుక్కుంటూ వచ్చి పెళ్లి చేసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
జార్జియాకు (Georgia) చెందిన ప్రెస్టన్ కాబ్ అనే యువకుడు (young man) సైన్యంలో పని చేసేవాడు. ఇరాక్ యుద్ధ (Iraq War) సమయంలో ఇతడు కీలక పాత్ర పోషించి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నాడు. ఇదిలావుండగా కాబ్‌కు.. గత ఏడాది సెప్టెంబర్‌లో తనేషా అనే యువతితో నిశ్చితార్థం (Engagement) జరిగింది. ఈ ఏడాది జూలై 22న వివాహం జరగాల్సి ఉంది. అయితే వివాహానికి సరిగ్గా నెల రోజుల ముందు.. విధుల్లో ఉండగా ప్రమాదవశాత్తు మండుతున్న రసాయన పదార్థంలో పడిపోయాడు. ఈ ప్రమాదంలో కాబ్‌కు 32శాతం కాలిన గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స చేసిన వైద్యులు.. చివరకు అతడి చేతి వేళ్లను తొలగించాల్సి వచ్చింది.
Infertility Reasons: ఏవేవో అనుకుంటుంటారు కానీ.. పిల్లలు పుట్టకపోవడానికి ఈ 8 అంశాలే అసలు కారణాలు..!
నెలలో వివాహం జరగాల్సి ఉండగా.. తనకు ఇలా అవడం చూసి కాబ్ తట్టుకోలేకపోయాడు. దీనికంటే చనిపోవడమే మేలని బాధపడుతుండేవాడు. ఈ విషయం తెలుసుకున్న తనేషా.. పరుగు పరుగున ఆస్పత్రికి వచ్చింది. చావైనా బతుకైనా కలిసే జీవిద్దామంటూ తెగేసి చెప్పింది. వీరి సమస్య గురించి తెలుసుకున్న ఆస్పత్రి సిబ్బంది.. చివరకు వారి వివాహ ఏర్పాట్లను ఆస్పత్రిలోనే చేశారు. ఇలా చివరకు బంధువులు, స్నేహితులు, ఆస్పత్రి సిబ్బంది సమక్షంలో ఇద్దరూ వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ (Viral News) అవుతున్నాయి. నెటిజన్లు వీరిద్దరికీ వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్లు చేస్తున్నారు.
Viral Video: ఈ శునకానికి మస్తు టాలెంట్ ఉందిగా.. గేదెపైకి ఎక్కి నిల్చుని ఎలా వస్తోందో మీరే చూడండి..!