China: చైనాలో దారుణం.. బెడ్‌పై టాయిలెట్ పోసిందని.. రెండేళ్ల కూతుర్ని ఆ తండ్రి కిటికీలోంచి తలకిందులుగా వేళాడదీసి మరీ..
ABN , First Publish Date - 2023-07-27T20:33:14+05:30 IST
తెలిసీ తెలీని వయసులో తప్పులు చేసే చిన్న పిల్లలను సున్నితంగా మందలించి, సక్రమమైన మార్గంలో నడిపించాల్సిన తల్లిదండ్రులు.. అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు. కొందరైతే ఎలాంటి తప్పూ చేయకున్నా పిల్లల పట్ల రాక్షసంగా ప్రవర్తిస్తుంటారు. తమ శాడిజాన్ని మొత్తం వారిపై చూపిస్తుంటారు. ఇలాంటి...
తెలిసీ తెలీని వయసులో తప్పులు చేసే చిన్న పిల్లలను సున్నితంగా మందలించి, సక్రమమైన మార్గంలో నడిపించాల్సిన తల్లిదండ్రులు.. అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు. కొందరైతే ఎలాంటి తప్పూ చేయకున్నా పిల్లల పట్ల రాక్షసంగా ప్రవర్తిస్తుంటారు. తమ శాడిజాన్ని మొత్తం వారిపై చూపిస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. బెడ్‌పై టాయిలెట్ పోసిందని.. రెండేళ్ల కూతుర్ని ఓ తండ్రి కిటికీలోంచి తలకిందులుగా వేలాడదీశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘వీడసలు తండ్రేనా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సౌత్ చైనాలో (South China) ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య, రెండేళ్ల కూతురుతో కలిసి స్థానికంగా నివాసం ఉంటున్నాడు. ఇటీవల ఇతడు చేసిన నిర్వాకంపై స్థానికులతో పాటూ నెటిజన్లు మండిపడుతున్నారు. కూతురు తరచూ బెడ్‌పై టాయిలెట్ పోస్టుండడంతో తండ్రి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. రెండేళ్ల వయసు పాప అనికూడా రాక్షంసంగా ప్రవర్తించాడు. ఇటీవల ఓ రోజు చిన్నారి మళ్లీ బెడ్‍పై మూత్ర విసర్జన చేయడంతో అతడి కోపం కట్టలు తెంచుకుంది. కూతురుపై చేయి చేసుకోవడమే (Father assaults daughter) కాకుండా రెండస్తుల భవనం కిటికీ నుంచి తలకిందులుగా వేలాడుదీశాడు. దీంతో పాప భయంతో ఒక్కసారిగా గట్టిగా కేకలు పెట్టింది. అయినా ఏమాత్రం కనికరం లేకుండా ‘‘ఇంకోసారి బెడ్‌పై మూత్ర విసర్జన చేస్తావా’’.. అంటూ మందలించాడు.
ఇలా చాలా సేపు కూతుర్ని కాళ్లు పట్టుకుని వేలాడదీశాడు. చుట్టు పక్కల వారంతా అక్కడ గుమికూడి.. ‘‘పాపను ఏమీ చేయొద్దు’’.. అంటూ పదే పదే చెబుతున్నా పట్టించుకోలేదు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వీడియో వైరల్ అవడంతో అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో అతడిపై చర్యలు తీసుకునేందుకు చైనా యంత్రాంగం (Chinese government) సిద్ధమైంది. మరోవైపు మహిళా సంఘాల (Women's Associations) నాయకులు వారి ఇంటికి వెళ్లి తండ్రిని మందలించారు. ఇంకోసారి ఇలాంటి చర్యలు తీసుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
చైనాలో ఇలా పిల్లలకు కఠిన శిక్షలు విధించడం షరా మామూలుగా మారుతోంది. గతంలో, ఓ బాలుడు టీవీ ఎక్కువగా చూస్తున్నాడనే కోపంతో.. రాత్రి మొత్తం టీవీ చూస్తూ ఉండు అంటూ తల్లిదండ్రులు శిక్ష విధించారు. ఇలాంటి ఘటనలు రోజూ ఎక్కడోచోట జరుగుతూనే ఉంటాయి. పిల్లలు ఎంత ఎక్కువ నొప్పిని భరిస్తే.. అంత బలంగా, ధైర్యంగా ఉంటారని వారి నమ్మకమట. చిన్న చిన్న తప్పులకు పిల్లలను కఠినంగా శిక్షించే ఆచారం ఇప్పటికీ చైనాలో కొనసాగుతోంది. కాగా, పాపును తలకిందులుగా వేలాడదీసిన తండ్రి వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ‘‘ఇలాంటి తండ్రులకు కఠిన శిక్షలు విధించాలి’’.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Infertility Reasons: ఏవేవో అనుకుంటుంటారు కానీ.. పిల్లలు పుట్టకపోవడానికి ఈ 8 అంశాలే అసలు కారణాలు..!