Viral Video: ఆర్డర్ ఆమెదే.. ఆస్వాదించింది మాత్రం ఇంకొకరు.. ఎదురుగా ఉన్న ఆ వ్యక్తి వీడియో తీయకపోయి ఉంటే..!

ABN , First Publish Date - 2023-07-26T20:55:10+05:30 IST

ప్రస్తుత సోషల్ మీడియాలో యుగంలో ఎక్కడ ఏం ఘటన జరిగినా.. కెమెరా కంటికి దొరికిపోవడం, ఆ వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవడం సర్వసాధారణమైపోయింది ఇలాంటి వినూత్న ఘటనలకు సంబంధించిన వీడియోలను నెట్టింట రోజూ చూస్తూనే ఉంటాం. వీటిలో కొన్ని...

Viral Video: ఆర్డర్ ఆమెదే.. ఆస్వాదించింది మాత్రం ఇంకొకరు.. ఎదురుగా ఉన్న ఆ వ్యక్తి వీడియో తీయకపోయి ఉంటే..!

ప్రస్తుత సోషల్ మీడియాలో యుగంలో ఎక్కడ ఏం ఘటన జరిగినా.. కెమెరా కంటికి దొరికిపోవడం, ఆ వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవడం సర్వసాధారణమైపోయింది ఇలాంటి వినూత్న ఘటనలకు సంబంధించిన వీడియోలను నెట్టింట రోజూ చూస్తూనే ఉంటాం. వీటిలో కొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ప్రస్తుతం అలాంటి ఆశ్చర్యాన్ని కలిగించే ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. ఓ యువతి హోటల్లో తనకు నచ్చిన ఫుడ్‌ను తింటున్న సమయంలో అనుకోని అతిథి అక్కడికి వచ్చి, ఆస్వాదించి వెళ్లిపోయింది...

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి రెస్టారెంట్‌కి వెళ్లి తనకు ఇష్టమైన పాస్తా ఫుడ్‌ని ఆర్డర్ చేసింది. ఫుడ్ రాగానే ఎంతో ఇష్టంగా తింటూ ఉంటుంది. అయితే మధ్యలో ఉన్నట్టుండి ఓ పిచ్చుక (sparrow) ఎగురుకుంటూ అక్కడికి వస్తుంది. ఎంత ఆకలితో ఉందో ఏమో గానీ పాస్తాను చూడగానే.. క్షణం ఆలస్యం చేయకుండా ప్లేట్‌ పైన వాలిపోతుంది. కాసేపు ఆహారాన్ని (sparrow tasted pasta food) రుచి చూసి ‘‘వావ్! ఈ ఫుడ్ ఎంత టేస్టీగా ఉంది’’.. అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి‪ అక్కడి నుంచి రివ్వున ఎగిరిపోతుంది.

Hyderabad Woman: అమెరికా వీధుల్లో హైదరాబాద్ యువతి.. చదువుకునేందుకు వెళ్లి.. చివరకు పేరు కూడా గుర్తు లేని స్థితిలో..

ఉన్నట్టుండి అక్కడికి వచ్చిన పిచ్చుక.. ఎవరికీ భయపడకుండా ఫుడ్ టేస్ట్ చేయడం చూసి సదరు యువతి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆ వెంటనే సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతుంది. ఈ ఘటనను మొత్తం ఎదురుగా ఉన్న వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‍‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఈ పిచ్చుక ఫాస్ట్‌ఫుడ్‌కి బాగా అలవాటు పడ్డట్టుంది’’.. అని కొందరు, ‘‘ఈ పిచ్చుకకు చాలా ధైర్యం ఉన్నట్టుంది’’.. అని మరికొందరు, ‘‘ఆకలి.. రుచితో పాటూ భయం కూడా ఎరుగదు’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 42 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Aadhaar Card: వామ్మో.. వీడు మామూలోడు కాదు.. మోదీ, యోగి ఆధార్‌ కార్డుల్నే వాడేశాడు.. వాటిని మార్చాలని ట్రై చేసి..!

Updated Date - 2023-07-26T20:55:10+05:30 IST