Marriage: పెళ్లి వేడుకలో ఫన్నీ గేమ్.. వరుడే గెలిచాడు కానీ.. పెళ్లయ్యాక అతడి పరిస్థితేంటో.. నెట్టింట పేలుతున్న సెటైర్లు..!
ABN , First Publish Date - 2023-07-27T14:55:56+05:30 IST
వివాహ కార్యక్రమాల్లో చోటు చేసుకునే సరదా సంఘటనలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. తలంబ్రాలు చల్లుకునే సమయంలో, నీళ్లలో ఉంగరాలు తీసే సమయంలో, దండలు మార్చుకునే సమయంలో.. ఒకరిపై ఇంకొకరు పైచేయి సాధించాలనే ఉద్దేశంతో వధూవరులు పోటీపడుతుంటారు. ఇలాంటి...
వివాహ కార్యక్రమాల్లో చోటు చేసుకునే సరదా సంఘటనలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. తలంబ్రాలు చల్లుకునే సమయంలో, నీళ్లలో ఉంగరాలు తీసే సమయంలో, దండలు మార్చుకునే సమయంలో.. ఒకరిపై ఇంకొకరు పైచేయి సాధించాలనే ఉద్దేశంతో వధూవరులు పోటీపడుతుంటారు. ఇలాంటి సరదా సంఘటనలు చూపరులకు వినోదాన్ని అందిస్తుంటాయి. ఈ తరహా వీడియోలు నెట్టింట కూడా తెగ హల్‌చల్ చేస్తుంటాయి. తాజగా, ఓ వివాహ వేడుకకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. పెళ్లయ్యాక అతడి పరిస్థితేంటో.. అంటూ సెటైర్లు పేల్చుతున్నారు.
సోషల్ మీడియాలో వధూవరులకు సంబంధించిన వీడియో (Viral video) ఒకటి వైరల్‌గా మారింది. వివాహ వేడుకలో (wedding ceremony) వేదికపై అతిథుల సమక్షంలో వధూవరులు (bride and groom) దండలు మార్చుకుంటుంటారు. అయితే ఈ సమయంలో పక్కన ఉన్న స్నేహితులు.. వారిని పోటీకి ఉసిగొల్పుతారు. కొందరు వధువుకు సపోర్టుగా నిలబడితే.. మరికొందరు వరుడికి మద్దతుగా నిలబడతారు. దండ ఎవరు ముందు వేయాలనే విషయంలో పోటీ నెలకొంటుంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి ముందుకొచ్చి.. వరుడిని పైకి ఎత్తుకుంటాడు. దీంతో దండ (garland) వేయడం వధువుకు ఇబ్బందిగా మారుతుంది.
అయినా వరుడి మెడలో దండ వేయాలని వధువు శతవిధాలా ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో వారి మధ్య సరదా పోటీ నెలకొంటుంది. చివరకు వధువు మెడలో వరుడు దండ వేసి.. తానే గెలిచానని సంబరపడిపోతాడు. ఈ ఘటనను మొత్తం అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘పెళ్లిలో ఇలాంటి ఘటనలు చూసేందుకు చాలా సరదాగా ఉంటాయి’’.. అనే కొందరు, ‘‘ఈ జంట చూడముచ్చటగా ఉంది’’.. అని మరికొందరు, ‘‘ఇప్పుడు గెలిచాడు సరే.. పెళ్లయ్యాక ఇతడి పరిస్థితి ఏంటో’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.