Viral Video: ఈ శునకానికి మస్తు టాలెంట్ ఉందిగా.. గేదెపైకి ఎక్కి నిల్చుని ఎలా వస్తోందో మీరే చూడండి..!
ABN , First Publish Date - 2023-07-28T15:13:14+05:30 IST
జంతువులకు సంబంధించిన వివిధ రకాల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. చాకచక్యంగా వేటాడే పులులు, సింహాలను చూశాం, అలాగే క్రూరమృగాల బారి నుంచి తెలివిగా తప్పించుకున్న జంతువులను చూశాం. అలాగే మనుషులను అనుకరించే జంతువులను కూడా...
జంతువులకు సంబంధించిన వివిధ రకాల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. చాకచక్యంగా వేటాడే పులులు, సింహాలను చూశాం, అలాగే క్రూరమృగాల బారి నుంచి తెలివిగా తప్పించుకున్న జంతువులను చూశాం. అలాగే మనుషులను అనుకరించే జంతువులను కూడా తరచూ చూస్తూ ఉంటాం. ప్రస్తుతం ఓ కుక్క, గేదెలకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఏకంగా గేదెపై నిల్చుని వెళ్తున్న కుక్కను చూసిన నెటిజన్లు.. ‘‘అరె! ఈ శునకం రాజభోగం అనుభవిస్తోందే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) వైరల్ అవుతోంది. జంతువుల మధ్య కొన్నిసార్లు సరదా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రస్తుతం ఓ కుక్క, గేదెల మధ్య అలాంటి సరదా సంఘటన చోటు చేసుకుంది. రెండు గేదెలు రోడ్డుపై వెళ్తుండగా.. ఓ కుక్కకు విచిత్రమైన ఐడియా వస్తుంది. వాటి వద్దకు వెళ్లి ఎలా బ్రతిమాలుకుందో ఏమో గానీ.. వెంటనే గేదెల పైకి ఎక్కి నిలబడుకుంది. రెండు గేదెలు సమాంతరంగా నడుస్తూ వెళ్తుండగా.. కుక్క వాటిపై స్టైల్‌గా (dog riding on buffalo) నిలబడి సవారీ చేస్తుంది.
Viral Video: ఈ పిల్లికి మనిషి పూనాడా ఏంటీ.. అర్ధరాత్రి రోడ్డు మధ్యలో ఏం చేస్తుందో చూడండి..
అలా చాలా దూరం గేదెల పైనే సవారీ చేస్తూ వెళ్తుంది. అదే సమయంలో ఓ కుక్క రోడ్డు పక్క వెళ్తూ గేదెలపై ఉన్న కుక్కను చూసి ‘‘దీని టైం ఇలా ఉంది.. నాకూ ఓ రోజు టైం వస్తుంది’’.. అనుకుంటూ రోడ్డు పక్కన నిరాశగా నిలబడి ఉంటుంది. చుట్టు పక్కల వారు ఈ ఘటనను చూసి తెగ నవ్వుకున్నారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘రాజాధిరాజు వేంచేస్తున్నాడహో..’’ అంటూ కొందరు, ‘‘ఈ కుక్క ప్లాన్ భలే ఉందే’’.. అని మరికొందరు, ‘‘ఈ కుక్క సినిమాలు చూసి చెడిపోయినట్లుంది’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 50వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Infertility Reasons: ఏవేవో అనుకుంటుంటారు కానీ.. పిల్లలు పుట్టకపోవడానికి ఈ 8 అంశాలే అసలు కారణాలు..!