ODI World Cup: ప్రపంచకప్ షెడ్యూల్‌లో భారీ మార్పులు.. భారత్ vs పాకిస్థాన్‌తో పాటు ఏకంగా 9 మ్యాచ్‌లు రీషెడ్యూల్!
ABN , First Publish Date - 2023-08-09T18:11:09+05:30 IST
అనుకున్నదే జరిగింది. వన్డే ప్రపంచకప్‌లో(ICC ODI World Cup 2023) భాగంగా అక్టోబర్ 15న జరగాల్సిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ షెడ్యూల్‌లో మార్పు చోటుచేసుకుంది. మ్యాచ్‌ను ఒక రోజు ముందుగా అంటే అక్టోబర్ 14న నిర్వహించనున్నట్లు ఐసీసీ(ICC) అధికారికంగా ప్రకటించింది.
దుబాయ్: అనుకున్నదే జరిగింది. వన్డే ప్రపంచకప్‌లో(ICC ODI World Cup 2023) భాగంగా అక్టోబర్ 15న జరగాల్సిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ షెడ్యూల్‌లో మార్పు చోటుచేసుకుంది. మ్యాచ్‌ను ఒక రోజు ముందుగా అంటే అక్టోబర్ 14న నిర్వహించనున్నట్లు ఐసీసీ(ICC) అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ మార్పు ఒక భారత్, పాకిస్థాన్(India vs Pakistn) మ్యాచ్‌కే పరిమితం కాలేదు. ఏకంగా 9 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐసీసీ రీషెడ్యూల్ చేసింది. రీషెడ్యూల్ అయిన వాటిలో పాకిస్థాన్ జట్టువి అత్యధికంగా 3 మ్యాచ్‌లు ఉన్నాయి. ఆ తర్వాత భారత్, ఇంగ్లండ్ జట్లవి రెండేసి మ్యాచ్‌ల చొప్పున రీషెడ్యూల్ అయ్యాయి. భారత జట్టు లీగ్ స్టేజ్ చివరలో నెదర్లాండ్స్‌తో(India vs Netherlands) ఆడాల్సిన మ్యాచ్ షెడ్యూల్‌లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మ్యాచ్ నిజానికి నవంబర్ 11న జరగాల్సి ఉండగా.. తాజాగా నవంబర్ 12కు రీషెడ్యూల్ అయింది. కాగా ఐసీసీ తెలిపిన వివరాల ప్రకారం రీషెడ్యూల్ అయిన మ్యాచ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.
ఇంగ్లాండ్ vs బంగ్లాదేశ్ - అక్టోబర్ 10, 10:30 AM
పాకిస్తాన్ vs శ్రీలంక - అక్టోబర్ 10, 2 PM
ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా - గురువారం, అక్టోబర్ 12, 2 PM
న్యూజిలాండ్ vs బంగ్లాదేశ్ - శుక్రవారం, అక్టోబర్ 13, 2 PM
భారత్ vs పాకిస్థాన్ - శనివారం, అక్టోబర్ 14, 2 PM
ఇంగ్లాండ్ vs ఆఫ్ఘనిస్తాన్ - ఆదివారం, అక్టోబర్ 15, 2 PM
ఆస్ట్రేలియా vs బంగ్లాదేశ్ - శనివారం, నవంబర్ 11, 10:30 AM
ఇంగ్లండ్ vs పాకిస్థాన్ - శనివారం, నవంబర్ 11, 2 PM
ఇండియా vs నెదర్లాండ్స్ - ఆదివారం, నవంబర్ 12, 2 PM