IND vs SL Final: టాస్ గెలిచిన శ్రీలంక.. టీమిండియాలో కీలక మార్పులు

ABN , First Publish Date - 2023-09-17T14:44:48+05:30 IST

ఆసియా కప్ 2023 ఫైనల్‌లో అతిథ్య జట్టు శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాయిన్ వేయగా.. శ్రీలంక కెప్టెన్ దసున్ శనక హెడ్స్ చెప్పాడు.

IND vs SL Final: టాస్ గెలిచిన శ్రీలంక.. టీమిండియాలో కీలక మార్పులు

కొలంబో: ఆసియా కప్ 2023 ఫైనల్‌లో అతిథ్య జట్టు శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాయిన్ వేయగా.. శ్రీలంక కెప్టెన్ దసున్ శనక హెడ్స్ చెప్పాడు. కాయిన్ హెడ్స్ పడింది. దీంతో శ్రీలంక టాస్ గెలిచింది. టాస్ గెలిచిన దసున్ శనక ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. అలాగే ఈ మ్యాచ్‌లో తాము ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్టు శనక చెప్పాడు. మహేష్ తీక్షణ స్థానంలో దుషన్ హేమంతను తుది జట్టులోకి తీసుకున్నట్టు తెలిపాడు. టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ ఈ రోజ్ మ్యాచ్ ఆడుతున్నట్టు చెప్పాడు. అలాగే గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు అక్షర్ పటేల్ అందుబాటులో లేడని, అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు తెలిపాడు.


తుది జట్లు

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్

శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుశల్ పెరీరా, కుశల్ మెండిస్(వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలాగే, దుషన్ హేమంత, ప్రమోద్ మదుషన్, మతీషా పతిరన

Updated Date - 2023-09-17T15:37:51+05:30 IST