Arvind: కాళేశ్వరం పేరుతో కేసీఆర్ లక్షల కోట్లు దోచుకున్నారు
ABN , First Publish Date - 2023-11-23T22:20:29+05:30 IST
కాళేశ్వరం పేరుతో సీఎం కేసీఆర్ ( CM KCR )లక్షల కోట్లు దోచుకున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్ ( MP Dharmapuri Arvind ) అన్నారు.
సిద్దిపేట: కాళేశ్వరం పేరుతో సీఎం కేసీఆర్ ( CM KCR )లక్షల కోట్లు దోచుకున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్ ( MP Dharmapuri Arvind ) అన్నారు. గురువారం నాడు దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు మద్దతుగా దౌల్తాబాద్ మండల కేంద్రంలో రోడ్ షో లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా అరవింద్ మీడియాతో మాట్లాడుతూ..‘‘రఘునందన్‌రావును విమర్శించే ముందు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎటు పోయాయో చెప్పాలి. మంత్రి కేటీఆర్ దౌల్తాబాద్‌కు వచ్చి రఘునందన్‌రావును తిట్టడం కాదు.. కేసీఆర్‌ని మేనిఫెస్టో ఎందుకు అమలు చేయలేదో కేటీఆర్ నిలదీయాలి’’ అని అరవింద్ అన్నారు.
కవిత లక్షల కోట్లు అవినీతి చేసింది
‘‘కాళేశ్వరం, అన్నారం, సుందిల్ల ప్రాజెక్టులు నిర్మిస్తే అప్పుడే కుంగిపోతున్నాయి. కల్వకుంట్ల కవిత లక్షల కోట్లు అవినీతి చేసి లిక్కర్ వ్యాపారం పెట్టుకుంది. బీజేపీ నేతలు అవినీతి చేయరు. నేను ఐదేళ్లు ఎంపీగా ఉండి ఐదు పైసలు తీసుకోలేదు. భూ ఖబ్జాలు, మొరం దందాలు, ఇసుక దందాలు చేసేది బీఆర్ఎస్ పార్టీనే. రఘునందన్‌రావును రెండోసారి భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలి’’ అని అరవింద్ పిలుపునిచ్చారు.