Share News

Asaduddin Owaisi: బాబ్రీ మసీదు కూల్చివేతలో ఆ రెండు పార్టీల పాత్ర ఉంది

ABN , First Publish Date - 2023-11-03T17:13:17+05:30 IST

బాబ్రీ మసీదు ( Babri Masjid ) కూల్చివేతలో బీజేపీ, RSS పాత్ర ఎంత ఉందో కాంగ్రెస్ పార్టీది కూడా అంతే ఉందని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ( Asaduddin Owaisi ) తీవ్ర ఆరోపణలు చేశారు.

Asaduddin Owaisi:  బాబ్రీ మసీదు కూల్చివేతలో ఆ రెండు పార్టీల పాత్ర ఉంది

హైదరాబాద్: బాబ్రీ మసీదు ( Babri Masjid ) కూల్చివేతలో బీజేపీ, RSS పాత్ర ఎంత ఉందో కాంగ్రెస్ పార్టీది కూడా అంతే ఉందని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ( Asaduddin Owaisi ) తీవ్ర ఆరోపణలు చేశారు. శుక్రవారం నాడు ఎంఐఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘కాంగ్రెస్ నేత కమల్ నాథ్ వ్యాఖ్యలు విన్నాను.. కాంగ్రెస్, RSSకి అమ్మ లాంటింది. బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో యూపీలో ఉంది కాంగ్రెస్ సర్కారే. సెక్యులరిజం అనే అబద్ధపు నినాదంతో కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. హిందుత్వ ఐడీయాలజీలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఉన్నాయి. రామమందిర ప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఏఐసీపీ అగ్రనేత రాహుల్ గాంధీనీ కూడా తీసుకెళ్లాలి ..ఇద్దరు ఒక్కటే. బాబ్రీ మసీదు కూల్చివేత నిందితులకు ఎవ్వరికీ శిక్ష పడలేదు. భారత్ జోడో అని రాహుల్ గాంధీ అబద్ధాలు మాట్లాడుతున్నాడు. తెలంగాణ సెక్రటేరియట్ ఉన్న మసీద్‌ను కూల్చారు. సీఎం కేసీఆర్ అర్థం చేసుకుని కొత్త సెక్రటేరియట్‌లో మసీదు నిర్మించారు’’ అని అసదుద్దీన్ తెలిపారు.

Updated Date - 2023-11-03T17:13:20+05:30 IST