Share News

Telangana Polls : ఎన్నికల ముందు బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా

ABN , First Publish Date - 2023-11-23T19:38:10+05:30 IST

జిల్లాలో బీఆర్ఎస్‌ పార్టీ ( BRS party ) కి బిగ్ షాక్ తగిలింది. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల జెడ్పీటీసీ తిరుమలగౌడ్ ( Tirumala Goud ) ఆ పార్టీకి రాజీనామా చేశారు.

Telangana Polls : ఎన్నికల ముందు బీఆర్ఎస్‌కు  బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా

కామారెడ్డి : ఎన్నికల ముందు కామారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్‌ పార్టీ ( BRS party ) కు బిగ్ షాక్ తగిలింది. జిల్లాలోని దోమకొండ మండల జడ్పీటీసీ తిరుమలగౌడ్ ( Tirumala Goud ) ఆ పార్టీకి రాజీనామా చేశారు. కరీంనగర్ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పథకాలు నచ్చి పార్టీలో చేరుతున్నట్టు వెల్లడించారు.

రాజీనామా ఎందుకు..?

అయితే గత కొంతకాలంగా తిరుమలగౌడ్ బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో సముచిత స్థానం కల్పిచకపోవడంతోనే పార్టీ మారినట్లు తెలుస్తోంది. ఇటీవల బీఆర్ఎస్‌ పార్టీ చేపట్టిన కార్యక్రమాలకు సైతం ఆయన దూరంగా ఉంటున్నారు. ఆయనతో పాటు పలువురు నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తిరుమలగౌడ్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడంతో దోమకొండ మండలంలో బీఆర్ఎస్ పార్టీకి కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2023-11-23T20:05:49+05:30 IST