CM KCR: కాంగ్రెస్ హయాంలో తాగడానికి కూడా నీళ్లు ఇవ్వలేదు
ABN , First Publish Date - 2023-11-23T19:24:15+05:30 IST
బీఆర్ఎస్ ( BRS ) పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం..హక్కుల సాధించుకోవడం కోసమని సీఎం కేసీఆర్ ( CM KCR ) వ్యాఖ్యానించారు.
సంగారెడ్డి: బీఆర్ఎస్ ( BRS ) పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం..హక్కుల సాధించుకోవడం కోసమని సీఎం కేసీఆర్ ( CM KCR ) వ్యాఖ్యానించారు. గురువారం నాడు పఠాన్ చెరు లోని ఎస్‌ఆర్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ...‘‘మాకు ఢిల్లీలో బాస్‌లు ఉండరు..మాకు బాస్ లు మీరే.. కాంగ్రెస్ పార్టీ మూడు గంటల కరెంట్ చాలని అంటున్నారు..వారి హయంలో తాగడనికి కూడా నీళ్లు ఇవ్వలేదు. ప్రజాస్వామ్యంలో ప్రజల వద్ద ఉండే ఓకే ఒక ఆయుధం ఓటు. రాబోవు రోజుల్లో కాలుష్యం లేని కంపెనీలు కూడా ఇక్కడికి వస్తాయి. మియపూర్ టు ఇస్సానపూర్ వరకు త్వరలోనే మెట్రో రైలు వస్తే పఠాన్ చెరు రూపు రేఖలు మారిపోతాయి. పఠాన్ చెరు అంటే ఒక మినీ ఇండియా. ఎండాకాలం వస్తే ఇక్కడ వలసలు పోయేవారు..ఇప్పుడా ఆ సమస్య లేదు. ఒకప్పుడు ఇక్కడ తాగడానికి కలుషిత నీరు ఉండేది..మేము వచ్చాక మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చాం. 2014లో మన తలసరి ఆదాయంలో 18వ స్థానంలో ఉండే..ఇప్పుడు తలసరి ఆదాయంలో నెంబర్ వన్ స్థానంలో ఉంది’’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి