TS Election: ఈ ఎన్నికల్లో రాష్ట్రం చూపు కరీంనగర్ వైపు
ABN , First Publish Date - 2023-11-28T15:26:44+05:30 IST
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం చూపు కరీంనగర్ వైపు చూస్తోంది. కరీంనగర్ నుంచి బరిలో ఈ సారి ఎమ్మెల్యే బరిలో బండి సంజయ్ నిలవనున్నారు. హుజురాబాద్ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. కోరుట్లలో బీజేపీ ఫైర్ బ్రాండ్ అరవింద్ పోటీ చేస్తున్నారు.
కరీంనగర్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం చూపు కరీంనగర్ వైపు చూస్తోంది. కరీంనగర్ నుంచి బరిలో ఈ సారి ఎమ్మెల్యే బరిలో బండి సంజయ్ నిలవనున్నారు. హుజురాబాద్ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. కోరుట్లలో బీజేపీ ఫైర్ బ్రాండ్ అరవింద్ పోటీ చేస్తున్నారు. జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్‌రెడ్డి పోటీలో ఉన్నారు. మంథనిలో శ్రీధర్ బాబు పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు బరిలో ఉన్నారు. సిరిసిల్లలో కేటీఆర్, కరీంనగర్ నుంచి గంగుల కమలాకర్, ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్ పోటీ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో అగ్ర నేతల పోటీ చేస్తున్నారు. గెలుపు ఓటములపై ఈ లెక్కలు ప్రభావం చూపనున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 12 సీట్లు ఉన్నాయి. 2014లో 11, 2018లోనూ బీఆర్ఎస్ పార్టీ 11 సీట్లు గెలిచింది. ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున ఈటల రాజేందర్ పోటీ చేసి గెలుపొందారు.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి