JP Nadda: తెలంగాణలో కుటుంబ పాలన వల్ల ఎలాంటి ప్రగతి లేదు
ABN , First Publish Date - 2023-11-23T15:41:05+05:30 IST
తెలంగాణలో కుటుంబ పాలన వల్ల ఎలాంటి ప్రగతి లేదని బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ( JP Nadda ) వ్యాఖ్యానించారు. గురువారం నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో నడ్డా మాట్లాడారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలిస్తే తెలంగాణ ముఖచిత్రం మారిపోతుందని, కేసీఆర్ తన కుటుంబాన్ని పైకి తేవడం తప్ప తెలంగాణ సమాజానికి చేసింది ఏమీలేదని అన్నారు.
నిజామాబాద్: తెలంగాణలో కుటుంబ పాలన వల్ల ఎలాంటి ప్రగతి లేదని బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ( JP Nadda ) వ్యాఖ్యానించారు. గురువారం నాడు నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో జేపీ నడ్డా మాట్లాడారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలిస్తే తెలంగాణ ముఖచిత్రం మారిపోతుందని హామీ ఇచ్చారు. కేసీఆర్ తన కుటుంబాన్ని పైకి తేవడం తప్ప తెలంగాణ సమాజానికి చేసింది ఏమీలేదని మండిపడ్డారు. కుటుంబ పాలన వల్ల ఎలాంటి ప్రగతి ఉండదని, తెలంగాణ ప్రగతి వెనుకబడి పోయిందని అన్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో కుటుంబ పాలన సాగుతోందన్నారు. ఇది కేసీఆర్ కుటుంబంతోనే కాదు దేశంలోని కుటుంబ వారసత్వ పాలకులపై పోరాటం చేస్తామని జేపీ నడ్డా హెచ్చరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌కి ఏటీఎంగా మారింది
కేసీఆర్, జగన్మోహన్‌రెడ్డితో పాటు దేశంలోని కుటుంబ పాలనకు ముగింపు పలకాలని జేపీ నడ్డా అన్నారు. అత్యధిక మైనారిటీలు తెలంగాణలో ఉన్నారని, ధరణి పోర్టల్ కేసీఆర్ ఆక్రమణలకు పోర్టల్‌గా మారిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌కి ఏటీఎంగా మారిందని, దళితబందు లాంటి పథకాలు బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేసీఆర్ ఊహా లోకంలో కట్టారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిజామాబాద్‌లో పసుపు బోర్డు ప్రకటించారు. దీంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించండి.. అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తాం’ అని జేపీ నడ్డా హామీ ఇచ్చారు.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి