Thummala: కరెంట్ కొనుగోలులో అవినీతి
ABN , First Publish Date - 2023-11-17T22:09:13+05:30 IST
తాను రైతును 24 గంటల కరెంట్ రావడం లేదు.. ఆరు గంటలే సరఫరా అవుతుందని ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) అన్నారు.
ఖమ్మం: తాను రైతును 24 గంటల కరెంట్ రావడం లేదు.. ఆరు గంటలే సరఫరా అవుతుందని ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) అన్నారు. శుక్రవారం నాడు 49 వ డివిజన్లో తుమ్మల రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ..‘‘కరెంట్ ప్రాజెక్ట్స్ లో కమీషన్ల అవినీతి. కరెంట్ కొనుగోలులో అవినీతి. సాగునీటి ప్రాజెక్ట్లు కమీషన్ల కోసం కూలిపోయేట్టు కట్టారు. ఐదు లక్షల కోట్లు అప్పులు చేశారు.పేపర్ లీకేజ్లతో నియామకాలు లేవు. తెలంగాణ అవినీతి అరాచక కబ్జాదారుల పాలైందని సోనియా గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం బీహార్ మాదిరిగా తయారైంది. ఖమ్మంలో అరాచక అవినీతి కబ్జాదారులను తరమి కొట్టాలి. ప్రశాంతమైన ఖమ్మం కోసం కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలని తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.