TPCC Chief: కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఐటీ రైడ్స్‌పై రేవంత్ రియాక్షన్ ఇదే...
ABN , First Publish Date - 2023-11-09T10:20:07+05:30 IST
కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి.
హైదరాబాద్: కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు (IT Raids) కలకలం రేపుతున్నాయి. ఈరోజు(గురువారం) మాజీ ఎంపీ, కాంగ్రెస్ పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) నివాసం, కార్యాలయాలపై ఐటీ సోదాలు నిర్వహించింది. ఖమ్మం, హైదరాబాద్‌లోని పొంగులేటి నివాసం, కార్యాలయాల్లో దాడులు జరుగుతున్నాయి. ఐటీ దాడులపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ..‘‘నేడు పొంగులేటి, నిన్న తుమ్మల, అంతకు ముందు పలువురు కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు దేనికి సంకేతం!? బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ ఎందుకు జరగడం లేదు!? రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ రాబోతోందని స్పష్టమైన సమాచారం రావడంతో మోడీ - కేడీ బెంబేలెత్తుతున్నారు. ఆ సునామీని ఆపడానికి చేస్తోన్న కుతంత్రం ఇది. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను. నవంబర్ 30న కాంగ్రెస్ సునామీలో కమలం, కారు గల్లంతవడం ఖాయం’’ అంటూ రేవంత్ ట్వీట్ చేశారు.