Share News

TS NEWS: తెలంగాణలో 14 మంది ఐఏఎస్‌లకు పదోన్నతులు

ABN , Publish Date - Dec 19 , 2023 | 11:17 PM

తెలంగాణలో 14 మంది ఐఏఎస్‌లకు పదోన్నతులు కల్పించారు. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్‌ స్కేల్ ఐఏఎస్‌లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 2024 జనవరి 1వ తేదీ నుంచి వీరి పదోన్నతి అమల్లోకి రానున్నది.

TS NEWS: తెలంగాణలో 14 మంది ఐఏఎస్‌లకు పదోన్నతులు

హైదరాబాద్: తెలంగాణలో 14 మంది ఐఏఎస్‌లకు పదోన్నతులు కల్పించారు. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్‌ స్కేల్ ఐఏఎస్‌లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 2024 జనవరి 1వ తేదీ నుంచి వీరి పదోన్నతి అమల్లోకి రానున్నది. ఈమేరకు సీఎంస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా..ప్రమోషన్‌ పొందిన వారిలో పమేలా సత్పతి, అనురాగ్ జయంతి, గౌతమ్‌ పాత్రు, రాహుల్‌ రాజ్, భావేష్ మిశ్రా, సత్య శారదాదేవి, నారాయణ రెడ్డి, ఎస్. హరీష్, జి. రవి, కె. నిఖిల, అయేషా మష్రత్ ఖానమ్, సంగీత సత్యనారాయణ, యాసీన్‌ బాషా, వెంకట్రావ్ ఉన్నారు.

Updated Date - Dec 19 , 2023 | 11:17 PM