Revanth Vs Etela: రేవంత్‌ సవాల్‌పై ఈటల మౌనం.. కారణమిదేనా..

ABN , First Publish Date - 2023-04-22T12:26:11+05:30 IST

మునుగోడు ఉపఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా నిలిచాయి.

Revanth Vs Etela:  రేవంత్‌ సవాల్‌పై ఈటల మౌనం.. కారణమిదేనా..

హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికలకు (Munugodu Bypoll) సంబంధించి కాంగ్రెస్ పార్టీపై (Congress Party) బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (BJP MLA Etela Rajender) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా నిలిచాయి. ఈటల వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటల వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ.. తడిబట్టలతో చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రమాణానికి సిద్ధమని రేవంత్ సవాల్ విసిరారు. అయితే ఇంత చర్చకు కారణమైన ఈటల మాత్రం రేవంత్ సవాల్‌పై మౌనం వహించారు. అందుకు కేంద్రమంత్రి అమిత్ షా (Union Minister Amith Shah) పర్యటనలో బిజీగా ఉండటమే కారణంగా తెలుస్తోంది. రేపు హైదరాబాద్‌లో అమిత్‌షా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు బిజీబిజీగా ఉన్నారు. అమిత్‌ పర్యటన నేపథ్యంలో రేవంత్ సవాల్‌పై స్పందించేది లేదని ఈటల రాజేందర్ చెబుతున్నారు.

అయితే మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా కేసీఆర్ నుంచి కాంగ్రెస్ పార్టీకి రూ.25 కోట్లు ముట్టాయని ఈటల రాజేందర్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈటల వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈరోజు భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద తడి బట్టలతో ప్రమాణం చేసేందుకు సిద్ధమా అంటూ ఈటలకు రేవంత్ సవాల్ విసిరారు. దమ్ముంటే ఈరోజు సాయంత్రం భాగ్యలక్ష్మి అమ్మవారి గుడికి వచ్చి ప్రమాణం చేయాలని రేవంత్ సవాల్ చేశారు. అయితే రేవంత్ సవాల్‌పై ఈటల మౌనం వహిస్తున్న నేపథ్యంలో రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం.

Updated Date - 2023-04-22T12:48:39+05:30 IST