MLC Kavitha: మణిపూర్ అల్లర్లను కట్టడి చేయడంలో కేంద్రం విఫలం

ABN , First Publish Date - 2023-08-05T12:46:35+05:30 IST

మణిపూర్‌లో రెండు గిరిజన తెగల మధ్య కొట్లాట పెట్టించి చలి కాచుకుంటున్నారు. విభజించి పాలించి ఓట్లు దండుకోవాలని బీజేపీ చూస్తోంది. బ్రిటీషర్లు మొదలు పెట్టింది‌.. బీజేపీ ఫాలో అవుతుంది.

MLC Kavitha: మణిపూర్ అల్లర్లను కట్టడి చేయడంలో కేంద్రం విఫలం

హైదరాబాద్: మణిపూర్ అల్లర్లను కట్టడి చేయడంలో కేంద్రం విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఆరోపించారు. శాసనమండలిలో గిరిజన సంక్షేమంపై జరిగిన లఘు చర్చలో కవిత మాట్లాడారు. ‘‘మణిపూర్‌లో రెండు గిరిజన తెగల మధ్య కొట్లాట పెట్టించి చలి కాచుకుంటున్నారు. విభజించి పాలించి ఓట్లు దండుకోవాలని బీజేపీ (BJP) చూస్తోంది. బ్రిటీషర్లు మొదలు పెట్టింది‌.. బీజేపీ ఫాలో అవుతుంది. ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ కేంద్రానికి పంపించాం. 4 లక్షల 5 వేల ఎకరాలకు పోడు పట్టాలు పంపిణీ చేశాం. లక్షా యాబై వేల మంది గిరిజనులకు పోడు పట్టాలు ద్వారా లబ్ది చేకూరింది. ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి.. కేసీఆర్ సర్కార్ (KCR Government) నినాదం. గిరిజనులకు రూ.1336 కోట్లు కళ్యాణ లక్ష్మీ కోసం నిధులు ఖర్చు చేశాం. ఎస్టీలకు కేటాయించిన నిధులు ఎస్టీలకే ఖర్చు చేయటానికి కేసీఆర్ 2017లో ప్రత్యేక చట్టం తీసుకొచ్చారు. ఆదివాసీ భవన్‌తో పాటు కొమురం భీం పేరుతో జోడే ఘాట్‌ను అభివృద్ధి చేసుకున్నాం. రూ.22 కోట్లతో హైదరాబాద్‌లో సేవాలాల్ బంజారా భవన్ నిర్మించాం. తెలంగాణకు ట్రైబల్ సబ్ ప్లాన్ నిధులు కేంద్రం ఇవ్వటం లేదు.’’ అని కవిత ఆరోపించారు.

Updated Date - 2023-08-05T12:46:35+05:30 IST