Chada Venkata Reddy : కాంగ్రెస్ పార్టీతో మంతనాలు జరుపుతున్నాం
ABN , First Publish Date - 2023-10-14T14:56:57+05:30 IST
ఏ ఎన్నికల్లోనైనా వామపక్ష పార్టీలు ప్రజా ఏజెండాను అమలు చేస్తాయని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి(Chada Venkata Reddy) అన్నారు.
మంచిర్యాల: ఏ ఎన్నికల్లోనైనా వామపక్ష పార్టీలు ప్రజా ఏజెండాను అమలు చేస్తాయని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి(Chada Venkata Reddy) అన్నారు. శనివారం నాడు సీపీఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్ వామపక్షాలను వాడుకుని మోసం చేశారు. ఏక పక్షంగా కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీతో మంతనాలు జరుపుతున్నాం. బెల్లంపల్లి, హుస్నాబాద్, మునుగోడు, కొత్తగూడెం, వైరా అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని ప్రతిపాదించాం. ఒకటి, రెండు రోజుల్లో సర్దు బాటు కొలిక్కి వస్తుంది. సంక్షేమ పథకాల పేరిట బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోంది. చట్టాలను చుట్టాలుగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కింది. పోటీ పరీక్షలను వాయిదా వేస్తూ నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్ ఆడుకుంటున్నారు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇండియా కూటమి సంచలన విజయం సాధించబోతోంది’’ అని చాడ వెంకటెడ్డి పేర్కొన్నారు.