CM Revanth Reddy: MIM నేతలు ఎవరితో ఉండాలో ఆలోచించుకోవాలి
ABN , Publish Date - Dec 21 , 2023 | 04:43 PM
బీఆర్ఎస్ ( BRS ) తరపున MIM నేతలు ఎందుకు ఒకాలత్ తీసుకుంటున్నారని... వారు ఎవరి తరఫున ఉండాలో నిర్ణయించుకోవాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ...శ్రీశైలం విద్యుత్ ప్లాంట్‌లో ప్రమాదంపై ముందే సమాచారం అధికారులు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ ( BRS ) తరపున MIM నేతలు ఎందుకు ఒకాలత్ తీసుకుంటున్నారని... వారు ఎవరి తరఫున ఉండాలో నిర్ణయించుకోవాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ...‘‘శ్రీశైలం విద్యుత్ ప్లాంట్‌లో ప్రమాదంపై ముందే సమాచారం అధికారులు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. శ్రీశైలం విద్యుత్ ప్లాంట్ ప్రమాదంలో 9మంది మృతి చెందారు.ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఫాతిమా మృతి చెందితే గత ప్రభుత్వ ముఖ్యమంత్రి, విద్యుత్ మంత్రి, మజ్లిస్ నేతలు వెళ్లలేదు. ఫాతిమా కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ కలిసింది. దేశానికి మైనార్టీ నేతను రాష్ట్రపతి చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. మైనార్టీలకు 4శాతం రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ మాత్రమే. 12 శాతం రిజర్వషన్లను కల్పిస్తానని బీజేపీ మైనార్టీలను మోసం చేసింది. మైనార్టీలకు న్యాయం చేసే వాళ్లతో ఉంటారా? లేదా మోసం చేసే వాళ్లతో మజ్లిస్ నేతలు ఉంటారో.. తేల్చుకోవాలి’’ అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.