Narayana: ఏపీ సీఎం జగన్‌పై నారాయణ సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-02-22T15:03:41+05:30 IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy)పై సీపీఐ నేత నారాయణ (CPI Leader Narayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ... ఏపీ ముఖ్యమంత్రి జగన్ (AP CM) పరమ దుర్మార్గుడని... ఏపీ (Andhrapradesh)లో జరుగుతోన్న పరిణామాలను ఖండిస్తున్నట్లు తెలిపారు. పదికాలాలు ఉండాల్సిన వాడు .. తన రాజకీయానికి తనే ముగింపు పలుకుతున్నారని వ్యాఖ్యలు చేశారు. వైసీపీ (YCP) వాళ్ళే కొట్టి, దాడులు చేసి.. పట్టాభి (TDP Leader Pattabhi Ram)పై కేసులు పెట్టారన్నారు. కుటుంబంలో కూడా శత్రుశేషం ఉండకూడదని జగన్ భావించారని ఆయన తెలిపారు.
పులివెందులలో వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekanandareddy)ని బయటవారు హత్య చేయలేరని చెప్పుకొచ్చారు. చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu)ను ముసలివాడంటోన్న వైసీపీ... ఆయన పర్యటనలకు కరెంట్ ఎందుకు కట్ చేస్తున్నారని ప్రశ్నించారు. లోకేష్ పాదయాత్ర (Lokesh YuvaGalam Padayatra) చేస్తే జగన్ (YS Jagan)కు భయమెందుకని నిలదీశారు. పట్టాభి ఆరోగ్యం విషయంలో డాక్టర్లు తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చారన్నారు. ఏపీలో డాక్టర్లు తీరును ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ (Congress), కమ్యూనిస్టులకు శత్రుత్వం ఏమీ లేదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర (Revanth Reddy Padayatra)కు సీపీఐ నేతలు మద్దతులో తప్పేముందని నారాయణ పేర్కొన్నారు.