NCBN: చంద్రబాబును కలిసిన వైద్యులు.. ఏం చెప్పారంటే..?
ABN , First Publish Date - 2023-11-01T20:55:36+05:30 IST
ఏపీలోని ఉండవల్లి నివాసం నుంచి హైదరాబాద్‌లోని నివాసానికి తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) కొద్దిసేపటి క్రితమే వెళ్లారు.
హైదరాబాద్: ఏపీలోని ఉండవల్లి నివాసం నుంచి హైదరాబాద్‌లోని నివాసానికి తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) కొద్దిసేపటి క్రితమే వెళ్లారు. కాగా చంద్రబాబును డాక్టర్ల బృందం కలిశారు. బేగంపేట ఎయిర్ పోర్టునుంచి జూబ్లీహిల్స్‌లో తన నివాసానికి చంద్రబాబు చేరుకునే సరికే అక్కడే ఎఐజీ ఆస్పత్రి డాక్లర్లు ఇంటి వద్ద ఉన్నారు. చంద్రబాబుతో వైద్యులు సుదీర్ఘంగా మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితి, సమస్యలపై చంద్రబాబును అడిగి వివరాలు తెలుసుకున్నారు. డాక్టర్ల సూచన మేరకు రేపు ఉదయం 10 గంటలకు చంద్రబాబు ఎఐజీ ఆస్పత్రికి చంద్రబాబు వెళ్లనున్నారు. అవసరం అయిన పరీక్షలు చేసి కావాల్సిన వైద్యాన్ని చంద్రబాబుకు అందిస్తామని వైద్యులు తెలిపారు.