Etala Rajender: నాపై తప్పుడు రాతలు బాధించాయి

ABN , First Publish Date - 2023-09-21T16:30:33+05:30 IST

తనకు ఎవరూ శత్రువులు లేరు... కానీ తనపై కొంతమంది చెడు రాతలు రాస్తున్నారని అలా రాయడం ఎంతో బాధించిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (BJP MLA Etala Rajender) వ్యాఖ్యానించారు.

Etala Rajender:  నాపై తప్పుడు రాతలు బాధించాయి

హైదరాబాద్: తనకు ఎవరూ శత్రువులు లేరు... కానీ తనపై కొంతమంది చెడు రాతలు రాస్తున్నారని అలా రాయడం ఎంతో బాధించిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (BJP MLA Etala Rajender) వ్యాఖ్యానించారు. గురువారం నాడు బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదు. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం హామీలు ఇచ్చి ఆ తర్వాత మర్చిపోతున్నారు. దళిత బంధు పూర్తిగా ఎందుకు అమలు చేయడం లేదు. నిరుద్యోగ భృతి ఏమైంది. వైన్స్ టెండర్ల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యాపారస్తుల జేబులు కత్తిరించింది. రుణమాఫీ కాక రైతులు నష్టపోతున్నారు. 57ఏళ్లకే పెన్షన్లు , వితంతు పెన్షన్లు కూడా ఇస్తానని ఇవ్వడం లేదు. డబ్బు లేకనే ఈ పథకాలను అమలు చేయడం లేదు. రాష్ట్రం దివాళా తీసిందని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలవుతాయా లేదా ఆలోచించుకోవాలి. గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవంతో చెబుతున్నా కాంగ్రెస్ నేతలు ఏది పడితే ఆ పథకం ప్రకటించకండి. ఏ మహిళలకు రెండు వేల రూపాయలు ఇస్తారు. ఈ ఆరు హామీలను ఎలా అమలు చేస్తారో కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టం చేయాలి. కర్ణాటకలో వలవికానీ హామీల ఇచ్చి.. ప్రభుత్వం ఏర్పాటు చేశాక చేతులేత్తేశారు. రాష్ట్రంలో వచ్చే ఆదాయంపై బీజేపీకి మంచి అవగాహన ఉంది.

అణగారిన వర్గాలకు ఎలా సంక్షేమ పథకాలు అమలు చేయాలో బీజేపీ అధిష్ఠానం స్టడీ చేసిన తర్వాత ప్రకటిస్తాం. అతి త్వరలోనే మంచి మేనిఫెస్టోను ప్రకటిస్తాం. జాతీ నాయకత్వంతో మాట్లాడి ప్రజలకు మంచి చేసే పథకాలు ప్రకటిస్తాం. ప్రజల నమ్మకాన్ని ఒడిసి పట్టుకున్న నేతను నేను. రాష్ట్రంలో నన్ను గుర్తుపట్టని వారు ఎవరూ లేరు. హుజూరాబాద్‌లో 6 వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నన్ను ఓడించేందుకు కేసీఆర్ ప్రయత్నం చేశారు. నా ఫొటో హుజూరాబాద్ ప్రజల గుండెల్లో ఉంటుంది. నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తానని కొంతమంది భావిస్తున్నారు. రైతు బంధు పథకం చిన్న రైతులకు అమలు చేయాలని నేను మంత్రిగా ఉన్నప్పుడే చెప్పాను. లాబీయింగ్‌తోనే కొంతమంది బతుకుతుంటారు. ఎవరైనా లంచ్ మీటింగ్‌లు ఏర్పాటు చేసుకోవచ్చు’’ అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

Updated Date - 2023-09-21T16:30:33+05:30 IST