TS NEWS: గచ్చిబౌలి మహిళ హత్య కేసులో విస్తుపోయే నిజాలు.. విచారణలో ఏం తెలిదంటే..?
ABN , First Publish Date - 2023-09-04T22:12:35+05:30 IST
గత నెల 29వ తేదీన గచ్చిబౌలి నానక్ రామ్ గూడలో మహిళపై సామూహిక అత్యాచారం, హత్య(Gachibowli woman case) జరిగింది. ఈ కేసు నగరంలో సంచలనం సృష్టించింది. ఈ కేసును గచ్చిబౌలి పోలీసులు ఛేదించారు.
హైదరాబాద్ : గత నెల 29వ తేదీన గచ్చిబౌలి నానక్ రామ్ గూడలో మహిళపై సామూహిక అత్యాచారం, హత్య(Gachibowli woman case) జరిగింది. ఈ కేసు నగరంలో సంచలనం సృష్టించింది. ఈ కేసును గచ్చిబౌలి పోలీసులు ఛేదించారు. వివరాల్లోకి వెళ్తే.. గత నెల 27వ తేదీన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో మహిళ మిస్సింగ్ కేసు(Missing woman case) నమోదైంది.గత నెల 29వ తేదీన నానక్ రామ్ గుడలోని ఓ నిర్మాణ భవనంలో మహిళను హత్య చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ కేసు గచ్చిబౌలి, మాదాపూర్ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఈ కేసులోకి వచ్చిన నిజాలను చూసి పోలీసులు విస్తుపోయారు. ఈ కేసుకు సంబంధించిన విషయాలను సోమవారం నాడు మాదాపూర్ డీసీపీ సందీప్(Madapur DCP Sandeep) మీడియాకు వెల్లడించారు. డీసీపీ మాట్లాడుతూ.. ఈ కేసులో వెస్ట్ బెంగాల్‌కు(West Bengal) చెందిన ప్రధాన నిందితుడు శ్యమల్ రాయ్‌తో పాటు అతని ఇద్దరు స్నేహితులను అనుమానం వచ్చి నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టాం. ఈ కేసులో వారు చెప్పిన నిజాలు షాకుకు గురి చేశాయి.
ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్యమల్ రాయ్(27)కు హత్యకు గురైన మహిళకు ఇదివరకే సన్నిహిత సంబంధం ఉంది. అదే క్రమంలో గత నెల 27వ తేదీన నిందితుడు శ్యమల్ రాయ్ మహిళను కలవాలని ఆమెకు ఫోన్ చేసి పిలిపించాడు. మహిళ ఆ ప్రదేశానికి వచ్చింది. ఆమెను నిర్మాణంలో ఉన్న భవనంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు.మహిళ ప్రతిఘటించడంతో నిందితుడు బండరాయితో మొది హత్య చేశాడు. అనంతరం తన స్నేహితులు అశోక్ కుమార్, అలోక్ సర్కార్‌కు ఫోన్ చేసి వెస్ట్ బెంగాల్‌కు పారిపోయాడు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా భవన నిర్మాణనికి సంబంధించిన కాంట్రాక్టర్‌ను విచారించి నిందితులను గుర్తించినట్లు తెలిపారు.స్పెషల్ టీమ్‌లతో వెస్ట్ బెంగాల్‌కు వెళ్లి నిందితులను అరెస్ట్ చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు మాదాపూర్ డీసీపీ సందీప్ తెలిపారు.