MLC Kavitha ; నిజమైన రంగులు వెలిసిపోవంటూ పోస్టర్లు..

ABN , First Publish Date - 2023-03-11T09:37:54+05:30 IST

ఎమ్మెల్సీ కవిత వీడి విచారణకు హాజరవుతున్న రోజు హైదరాబాద్‌లో వెలిసిన ఫ్లె్క్సీలు ఆసక్తికరంగా మారాయి. ఈడీ, సీబీఐ, బీజేపీ బెదిరింపు రాజకీయాలపై హైదరాబాద్‌లో పోస్టర్లు వెలిశాయి.

MLC Kavitha ; నిజమైన రంగులు వెలిసిపోవంటూ పోస్టర్లు..

హైదరాబాద్ : ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఈడి విచారణకు హాజరవుతున్న రోజు హైదరాబాద్‌లో వెలిసిన ఫ్లెక్సీలు ఆసక్తికరంగా మారాయి. ఈడీ (ED), సీబీఐ (CBI), బీజేపీ (BJP) బెదిరింపు రాజకీయాలపై హైదరాబాద్‌లో పోస్టర్లు వెలిశాయి. బీజేపీలో చేరకముందు.. చేరిన తర్వాత అంటూ పలువురు బీజేపీ నేతల ఫోటోలతో పోస్టర్లు వెలిశాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు నేతలు సీబీఐ, ఈడీ రెయిడ్స్ జరగగానే.. కాషాయరంగు పూసుకుని బీజేపీలో చేరిపోయారంటూ ఫ్లెక్సీలు వెలిశాయి.

ప్రస్తుత కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ, వెస్ట్ బెంగాల్ బీజేపీ ముఖ్య నేత సువేంధు అధికారి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్త ఎంపీ సుజనా చౌదరి, కేంద్ర మాజీ మంత్రి నారాయణ్ రాణె ఫొటోలతో పోస్టర్లు వెలిశాయి. కానీ ఎమ్మెల్సీ కవిత రెయిడ్స్‌కి ముందు.. తర్వాత ఎలాంటి మరక అంటకుండా ఉన్నారనే అర్థం వచ్చేలా ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేశారు. నిజమైన రంగులు వెలసిపోవు అంటూ పోస్టర్‌పై కొటేషన్ కూడా ఉంది. ఈ పోస్టర్లు హైదరాబాద్‌లో పలు చోట్ల అంటించడంతో అంతా ఆసక్తికరంగా చూస్తున్నారు. ఇక పోస్టర్‌ చివర్లో బై బై మోదీ అనే హాష్ టాగ్‌ సైతం దర్శనమిస్తోంది.

Updated Date - 2023-03-11T09:37:54+05:30 IST