యూటర్న్ తీసుకున్న KA Paul.. నేడు రేవంత్‌పై ఫైర్
ABN , First Publish Date - 2023-02-08T13:59:55+05:30 IST
ఇప్పటి వరకూ అధికార పార్టీ, ఆ పార్టీ నేతలపై మాత్రమే విమర్శలు గుప్పిస్తూ వస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాజాగా రూటు మార్చారు. టీపీసీసీ అధ్యక్షుడిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు
హైదరాబాద్ : ఇప్పటి వరకూ అధికార పార్టీ, ఆ పార్టీ నేతలపై మాత్రమే విమర్శలు గుప్పిస్తూ వస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) తాజాగా రూటు మార్చారు. టీపీసీసీ అధ్యక్షుడిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. విపక్ష నేతతో పాటు సీఎం కేసీఆర్ (CM KCR)ను సైతం విమర్శించారు. కేసీఆర్ డబ్బు వేస్ట్ చేస్తున్నాడని విమర్శించారు. అలాగే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (Revanth Reddy)పై కేఏ పాల్ ఫైర్ అయ్యారు. రేవంత్ నిన్న ప్రగతి భవన్ (Pragati Bhavan)ను తగుల బెట్టాలంటూ చేసిన వ్యాఖ్యలపై పెను దమారమే రేగుతున్న విషయం తెలిసిందే. దీనిపై నేడు కేఏ పాల్ సైతం స్పందించారు. అంతేకాదు.. ఏకంగా రేవంత్‌పై డీజీపీకి ఫిర్యాదు చేశానని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి భూ కబ్జాలు చేసి ఈ స్థాయికి వచ్చాడని కేఏ పాల్ విమర్శించారు.
‘‘ప్రగతి భవన్ తగలాబెట్టాలని చెప్పాడు దాని మీద నేను డీజీపీ (DGP)ని కలిసి కంప్లయింట్ ఇవ్వడం జరిగింది. ఓటుకి నోటు కేసులో దొరికి ఇప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) చెప్పినట్లు చేస్తున్నాడు. రేవంత్‌పై పీడీ యాక్ట్ (PD Act) నమోదు చేయాలి. ప్రజల కోసం పోరాడటం లేదు. రూ.500 కోట్ల రూపాయిల పాత సెక్రేరియట్ (Secretariat) కూలకొట్టి రూ.610 కోట్లు పెట్టి కొత్తది కట్టి డబ్బులు వేస్ట్ చేస్తూ సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారు. అంబేద్కర్ (Ambedkar) జయంతి రోజున ఓపెన్ చెయ్యాలని కోర్టులో పిల్ వేశాను. అగ్నప్రమాదం (Fire Accident)పై సైతం సీబీఐలో కంప్లైంట్ ఇచ్చాను సెంట్రల్ మినిస్టర్‌లకు చెప్పాను. రేవంత్ రెడ్డి ఒక జూనియర్ ఆయనకు ఈ పదవి తొలగించి సీనియర్ నాయకులు ఉన్నారు వారికి ఇవ్వాలి. బడుగు బలహీనర్గాలకు పీసీసీ పదవి ఇవ్వాలి’’ అని కేఏ పాల్ పేర్కొన్నారు.