Kasani Gnaneshwar: రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కనుమరుగవడం ఖాయం
ABN , First Publish Date - 2023-09-04T16:48:34+05:30 IST
రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS) కనుమరుగవడం ఖాయమని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్(Kasani Gnaneshwar) అన్నారు. సోమవారం నాడు ఇందిరాపార్క్(Indira Park)లో తెలుగుదేశం(Telugu Desham) మహాధర్నా చేపట్టింది.
హైదరాబాద్(ఇందిరాపార్క్): రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS) కనుమరుగవడం ఖాయమని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్(Kasani Gnaneshwar) అన్నారు. సోమవారం నాడు ఇందిరాపార్క్(Indira Park)లో తెలుగుదేశం(Telugu Desham) మహాధర్నా చేపట్టింది. ఈధర్నాలో జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్ఞానేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ..తెలుగుదేశం ప్రభుత్వంలో మాత్రమే పేదలకు న్యాయం జరిగింది. ఎన్నికలు వస్తున్నాయనే ఇప్పుడు డబుల్ బెడ్రూ రూం ఇళ్లు పంచుతున్నారు.నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వటం లేదు? ధరణిలో ఉన్న లోపాల గురించి ఎంత చెప్పిన తక్కువే. ప్రజల భూములు ధరణిలో లేవు.మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు. తెలంగాణ ప్రభుత్వం 11లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది.ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు.. కాని నాయకుల దగ్గర మాత్రం డబ్బులు ఉన్నాయి. ఉద్యోగులకి జీతాలు రావడం లేదు.కేసీఆర్ తొమ్మిదేళ్లల్లో హమీలు ఇవ్వడం తప్ప అమలు చెయలేదు. తెలుగుదేశం చెప్పిందే చేస్తుంది. ఎన్టీఆర్ 2రూపాయలకి బియ్యం ఇచ్చారని కాసాని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు.