Kishan reddy: కేసీఆర్‌కు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి

ABN , First Publish Date - 2023-09-11T21:00:00+05:30 IST

తెలంగాణ ఓ కుటుంబం చేతిలో బంది అయ్యిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) వ్యాఖ్యానించారు.

Kishan reddy: కేసీఆర్‌కు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి

హైదరాబాద్: తెలంగాణ ఓ కుటుంబం చేతిలో బంది అయ్యిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు బీజేపీ(BJP) కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘వచ్చే 89 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ ప్రజల కోసం పని చేసే నాయకులు కావాలా ఓ కుటుంబం కోసం పని చేసే నాయకులు కావాలా ఆలోచించండి. బీఆర్ఎస్(BRS)కి ఓటు వేస్తే కేసీఆర్(KCR) కుటుంబానికి ఓటు వేసినట్టు.. కాంగ్రెస్‌కి ఓటేస్తే సోనియాగాంధీ కుటుంబానికి వేసినట్టు. ప్రజల కోసం పని చేయాలంటే బీజేపీకి ఓటేయ్యాలి. ఈ దేశంలో అత్యధిక ధనవంతమైన పార్టీ బీఆర్ఎస్(BRS).. అవినీతికి కొమ్ముకాసే పార్టీలు BRS, కాంగ్రెస్. దేశంలో ఉన్న పార్టీల రాజకీయ ఖర్చులు నేను భరిస్తానని సీఎం కేసీఆర్ చెబుతున్నాడు. ఈ డబ్బులన్నీ కేసీఆర్‌కు ఎక్కడి నుంచి వచ్చాయి. కేసీఆర్ నయా నిజాం..మజ్లీస్‌తో కలిసి దందా చేస్తున్నాడు.

BRSకి ఓటేసిన కాంగ్రెస్‌కి ఓటేసినట్టే..కాంగ్రెస్‌కి ఓటేసిన అది BRSకి ఓటేసినట్టే. ఈ రెండు పార్టీలకు ఓటేస్తే మజ్లీస్ పార్టీకి ఓటేసినట్టే.ఈ మూడు పార్టీలు ఒక్కటే.. కేసీఆర్ నిరుద్యోగులకు అన్యాయం చేశాడు. ORR రింగ్ రోడ్డు 30 సంవత్సరాలు లీజుకి ఇచ్చి జీతాలు ఇస్తున్నారు.మద్యం షాపు టెండర్ల ద్వారా వచ్చిన డబ్బులతో ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారు. మరోసారి కేసీఆర్‌కి అధికారం ఇస్తే చిప్ప చేతికి ఇస్తాడు.మిగులు బడ్జెట్‌లో ఉన్న తెలంగాణని అప్పుల మయంగా మార్చారు. కేసీఆర్ కబంధ హస్తాల నుంచి తెలంగాణని కాపాడుకోవాలి.కాంగ్రెస్ నుంచి ఎవరు గెలిచినా మళ్లీ BRSలోకి పోతారు.రెండు పార్టీల DNA ఒక్కటే.. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలి’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-09-11T21:00:00+05:30 IST