Kodanda Reddy: భూముల అమ్మకంలో మొదటి నేరస్తుడు కేటీఆర్
ABN , First Publish Date - 2023-08-11T21:12:05+05:30 IST
భూములు రికార్డుల ప్రక్షాళన(Clearance of land records) పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt)లో అక్రమాలు జరిగాయని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి (Kisan Congress National Vice President Kodanda Reddy)ఆరోపించారు.
హైదరాబాద్: భూములు రికార్డుల ప్రక్షాళన(Clearance of land records) పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt)లో అక్రమాలు జరిగాయని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి (Kisan Congress National Vice President Kodanda Reddy)ఆరోపించారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ఇందిరా గాంధీ (Indira Gandhi)భూ సంస్కరణాల ద్వారా ఇచ్చిన భూములకు కేసీఆర్ ప్రభుత్వంలో అవకతవకలు జరుగుతున్నాయి.రంగారెడ్డి, మెదక్, నల్గొండలో ఆ భూములను చట్ట విరుద్ధంగా బిల్డర్స్‌కి అప్పగిస్తున్నారు.బుద్వెల్లో 282 ఎకరాలను దళితులకు భూ సంస్కరణల చట్టం కింద పంచారు.1995లో టీడీపీ హయాంలో అసైన్డ్ భూమి అని ఆర్డీవో నోటీసులు ఇచ్చారు. హైకోర్టు దళితులకు ఇచ్చిన భూములు లాక్కోవద్దని 2008 సంవత్సరంలో కోర్టు తీర్పు ఇచ్చింది.. ఆ భూములు ఇప్పటి వరకు దళితుల చేతిలోనే ఉన్నాయి.Hmda వంద ఎకరాల వరకు ఈవేళం వేసింది.24 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు ఉంటే 10 వేల ఎకరాల అసైన్డ్ భూములను బిల్డర్స్‌కి అప్పగించారు. భూములు అమ్మకంలో మొదటి నేరస్థుడు మున్సిపల్ మంత్రి కేటీఆర్.ధరణి లోపాల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంని వదలం.. న్యాయపోరాటం చేస్తాం. బీఆర్ఎస్ నేతలను గ్రామాల్లో తిరగనివ్వం. ఒక్కో గ్రామంలో దళితుల దగ్గర 9 లక్షలకు కొని 99 లక్షలకు అమ్ముకున్నారు. ఇందిరాగాంధీ పంచిన భూములు పేదలకు అందేలా కాంగ్రెస్ పోరాటం చేస్తుంది.ఈ భూముల అమ్మకం చెల్లదు. యూపీఏ ప్రభుత్వం టైటిల్ గ్యారంటీ చట్టం తేవడానికి సర్వేలు చేయడానికి డబ్బులు కూడా కేటాయించింది. నేను హుడా చైర్మన్‌గా ఉన్నప్పుడు 5 అంతస్థుల పైన కట్టద్దని నిర్ణయం తీసుకున్నాం.100 కోట్ల ఎకరానికి అమ్మిన భూమిలో SFI లిమిట్ లేదు ఎన్ని అంతస్థులు అయినా కట్టుకోవచ్చు.ఫ్లైట్ పోయే మార్గంలో ఇలాంటి నిర్మాణలు ఉండద్దు’’ అని కోదండరెడ్డి తెలిపారు.