Mainampalli : చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై ఎమ్మెల్యే మైనంపల్లి ఏమన్నారంటే..?
ABN , First Publish Date - 2023-09-15T20:05:55+05:30 IST
లుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu)ను ఏపీ ప్రభుత్వం(AP Govt) అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు(BRS MLA Mainampalli Hanumantha Rao) ఖండించారు.
హైదరాబాద్ : తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu)ను ఏపీ ప్రభుత్వం(AP Govt) అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు(BRS MLA Mainampalli Hanumantha Rao) ఖండించారు. శుక్రవారం నాడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మైనంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ రంగంలో పలు విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారని ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చంద్రబాబుపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టు, విచారణ అంతా అప్రజాస్వామ్యంగా జరిగిందన్నారు.ఏపీలో వైసీపీ ప్రభుత్వం నియంతలాగా మారిందని.. రాజకీయ కక్షతోనే చంద్రబాబును ఇబ్బందులకు గురిచేస్తోందని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మండిపడ్డారు.