Mallu Ravi: పార్లమెంట్‌లో ఎంపీలను సస్పెండ్ చేయడం అత్యంత దారుణం
ABN , Publish Date - Dec 19 , 2023 | 09:01 PM
పార్లమెంట్‌లో ఎంపీలను సస్పెండ్ చేయడం అత్యంత దారుణం.. ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ( Mallu Ravi ) వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ : పార్లమెంట్‌లో ఎంపీలను సస్పెండ్ చేయడం అత్యంత దారుణం.. ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ( Mallu Ravi ) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘78 మంది ఎంపీలను ఓకే రోజు సస్పెండ్ చేయడం పార్లమెంట్ చరిత్రలో ఇదే మొదటిసారి.ఇది పార్లమెంటరీ వ్యవస్థకు తీరని మచ్చ. ఆగంతకులు పార్లమెంట్‌లోకి వెళ్లడం దేశ చరిత్రలో ఘోరమైన సంఘటన. ఇంకేమైనా ప్రమాదం కలిగించిఉంటే ఏంటి పరిస్థితి. పార్లమెంట్ భధ్రతపై చర్చ చేయడానికి ఎందుకు భయపడుతున్నారు. హోంమంత్రి ఎందుకు స్పందించడం లేదు. వికసిత్ భారత్ అంటే ఇదేనా.. బీజేపీ ప్రభుత్వం సిగ్గు పడాలి. పార్లమెంట్‌పై ముష్కరుల దాడి జరిగిన రోజే ఈ ఘటన జరగడం భద్రత వైఫల్యం.పార్లమెంట్‌లో చర్చ జరగాలి.. ప్రజలందరికీ తెలియాలి’’ అని మల్లు రవి పేర్కొన్నారు.