Jagadish Reddy: తద్దినాలు, పిండాలు పెట్టడం తెలిసిన పార్టీలు ఆ రెండే
ABN , First Publish Date - 2023-08-09T12:39:25+05:30 IST
కాంగ్రెస్, టీడీపీ పార్టీలపై మంత్రి జగదీస్ రెడ్డి విరుచుకుపడ్డారు.
హైదరాబాద్: కాంగ్రెస్, టీడీపీ పార్టీలపై మంత్రి జగదీస్ రెడ్డి (Minister Jagadish Reddy) విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తద్దినాలు, పిండాలు పెట్టడం తెలిసిన పార్టీలు కాంగ్రెస్ (Congress), టీడీపీనే (TDP) అంటూ వ్యాఖ్యలు చేశారు. లక్షలాది మంది రైతులను ఇబ్బంది పెట్టిన పార్టీ నుంచి వచ్చిన రేవంత్‌కు అంతకు మించి మాటలు రావన్నారు. రైతులను ఆదుకున్నందుకు రేవంత్ పిండాలు పెడతాడా అని ప్రశ్నించారు. తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నందుకు కేసీఆర్‌కు (CM KCR) పిండం పెడతావా అంటూ మండిపడ్డారు. రేవంత్ తెలంగాణ రాష్ట్రానికే తద్దినం పెట్టాలనుకుంటున్నారన్నారు. సోనియా (Sonia Gandhi), రాహుల్‌పై (Rahul Gandhi) అక్రమ కేసులు పెడితే మొదట ఖండించింది కేసీఆర్ కాదా అని మంత్రి ప్రశ్నించారు.
రేవంత్ (TPCC Chief Revanth Reddy) లాంటి సంస్కారహీనున్ని కాంగ్రెస్ అధ్యక్షున్ని చేసిందన్నారు. పైసలతో కొనుక్కున్న పదవితో ఇంత అహంకారమా అని వ్యాఖ్యలు చేశారు. యాబై లక్షలతో దొరికి చంద్రబాబును (TDP Chief Chandrababu Naidu) నాశనం చేశావన్నారు. కరెంట్‌పై మాట్లాడి కాంగ్రెస్‌ను ఖతం చేశావన్నారు. తమకు ఎవరు శాశ్వత శత్రువులు లేరని.. అలాగే శాశ్వత మిత్రులు లేరని స్పష్టం చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలెంతో ఏపీ ప్రజలు అంతే అని చెప్పుకొచ్చారు. రేవంత్ నిఖార్సైన తెలంగాణ వాది అయితే జగన్ తండ్రి ఫోటో పెట్టుకొని ఎందుకు తిరుగుతున్నావని అడిగారు. గద్దర్ (Gaddar) బతికినంత కాలం ఎవరి దుర్మార్గాలపై పోరాటం చేశాడో తెలియదా అని అన్నారు. రేవంత్.. గద్దర్ గురించి మాట్లాడితే ఆయన ఆత్మ క్షోభిస్తుందన్నారు. కేసీఆర్‌తో గద్దర్ కలిసి పనిచేశారు తప్ప ఎవరితో కలవలేదని తెలిపారు. గద్దర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళేది తామే అని మంత్రి జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు.