Puvvada Ajay: రాహుల్ మెచ్యూరిటీ లేని లీడర్
ABN , First Publish Date - 2023-07-03T12:44:23+05:30 IST
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మెచ్యూరిటీ లేని లీడర్ అని మంత్రి పువ్వాడ అజయ్ విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నాయకత్వం వద్దని పక్కకు జరిగిన నేత రాహుల్ అని అన్నారు.
హైదరాబాద్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress Leader Rahul Gandhi) మెచ్యూరిటీ లేని లీడర్ అని మంత్రి పువ్వాడ అజయ్ (Minister Puvvada Ajay)విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నాయకత్వం వద్దని పక్కకు జరిగిన నేత రాహుల్ అని అన్నారు. కాంగ్రెస్ ను నట్టేట ముంచి పక్కకు జరిగిన నేత నిన్న ఖమ్మం వచ్చి మాట్లాడారన్నారు. తెలంగాణ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కనీస పోటీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అక్కడ బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ జరగలేదా అని నిలదీశారు. కాంగ్రెస్ నేతల ఇళ్ల మీద ఐటీ, ఈడీ రైడ్లు ఎందుకు జరగడం లేదన్నారు. తమ ఇళ్ల మీదనే ఐటీ రైడ్ ఎందుకు జరుగుతోందని నిలదీశారు. బాబ్రీ మజీద్‌ను కూల్చింది కాంగ్రెస్ హయాంలోనే.. ఇవన్నీ తమ మ్యాచ్ ఫిక్సింగ్ కాదా అని అన్నారు. ‘‘మీది కాంగ్రెస్ కాదు స్కాంగ్రేస్ పార్టీ’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హయాంలో భూమి నుంచి ఆకాశం వరకు అన్నింట్లో కుంభకోణమే అని ఆరోపించారు. నిన్న కాంగ్రెస్ చేరిన నేతల్లో ఎవరికీ పార్టీ అన్యాయం చేయలేదన్నారు. తెల్లం వెంకట్రావ్, పిడమర్తి, కోరం కనకయ్య టికెట్ ఇచ్చినా గెలవలేదన్నారు. ఇంతుంది అంతుందన్న నేత ఎందుకు వారిని గెలిపించలేకపోయారని ప్రశ్నించారు. భట్టి (Batti Vikramarka) పాదయాత్ర ముగింపు సభలో ఆయాన్నే పక్కకు తోసేశారని మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యలు చేశారు.