Sridhar Babu: ఇది చేతల ప్రభుత్వం.. మాటల ప్రభుత్వం కాదు
ABN , Publish Date - Dec 26 , 2023 | 08:05 PM
కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Govt ) చేతల ప్రభుత్వమని.. మాటల ప్రభుత్వం కాదని మంత్రి శ్రీధర్ బాబు ( Minister Sridhar Babu ) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు సచివాలయంలో ప్రజా పాలనపై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ...ఈ నెల 28వ తేదీ నుంచి ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలపై ప్రభుత్వ అధికారుల దగ్గర విజ్ఞప్తులు తెలియజేయవచ్చని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Govt ) చేతల ప్రభుత్వమని.. మాటల ప్రభుత్వం కాదని మంత్రి శ్రీధర్ బాబు ( Minister Sridhar Babu ) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు సచివాలయంలో ప్రజా పాలనపై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ...ఈ నెల 28వ తేదీ నుంచి ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలపై ప్రభుత్వ అధికారుల దగ్గర విజ్ఞప్తులు తెలియజేయవచ్చని అన్నారు. ప్రజా పాలన కార్యక్రమాన్ని 28వ తేదీన మొదలు పెట్టబోతున్నామని చెప్పారు. 6 జోన్లు, 30 సర్కిళ్లలో ప్రజాపాలన కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. అన్ని వార్డులు ప్రజలకు 6 గ్యారంటీలపై వివరిస్తామన్నారు. ప్రజలు అందరు ముందుకు వచ్చి సమస్యలపై వినతులు ఇవ్వవచ్చని చెప్పారు. ప్రతి వార్డులో 4 చోట్ల కౌంటర్లు ఏర్పాటు చేస్తామని.. అక్కడ సమస్యలపై విజ్ఞప్తులు తీసుకుంటారని అన్నారు. ప్రతి టీమ్ కు ఓ లీడర్‌తో పాటు వారికి అవేర్ నేస్ కోసం 7 గురు సభ్యులు అందుబాటులో ఉంటారని అన్నారు. మహిళలకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసి వారి విజ్ఞప్తులు తీసుకుంటామన్నారు. అన్ని శాఖలలో కలిసి ఈ ప్రజాపాలన కార్యక్రమం అమలు చేస్తామని చెప్పారు.
ప్రతి వార్డుకు టైం టేబుల్ ఇచ్చామని... ఏ సమయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారో ముందే తెలియజేస్తామని తెలిపారు. 150 వార్డులల్లో 28వ తేదీ నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు విజ్ఞప్తులు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరి విజ్ఞప్తి తీసుకుంటామన్నారు.30 సర్కిళ్లకు గానూ 30 స్పెషల్ ఆఫీసర్లను నియమించామని చెప్పారు. అభయ హస్తం అమలు చెయ్యడం మా ప్రధాన ధ్యేయమన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 48 గంటల్లోనే 2 పథకాలను అమలు చేశామని అన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ రైడ్, ఆరోగ్య శ్రీ ను 10 లక్షలకు పెంచామని తెలిపారు. ప్రజా పాలనలో ప్రజల సమస్యలపై ప్రజావాణి నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇన్ని రోజుల పాటు ప్రజా సమస్యలపై వినే వారు లేరని.. కానీ తాము ప్రజల కోసం పని చేసే వాళ్లమని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.