BRS: కేటీఆర్‌కు బేతి సుభాష్‌రెడ్డి ఝలక్.. ఏ పార్టీలో చేరబోతున్నారంటే..?!

ABN , First Publish Date - 2023-09-25T16:25:21+05:30 IST

మంత్రి కేటీఆర్‌(Minister KTR)కు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి(MLA Beti Subhash Reddy) ఝలక్ ఇచ్చారు. ఉప్పల్ భగాయత్‌లో మంత్రి కేటీఆర్ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి హాజరు కాలేదు.

BRS: కేటీఆర్‌కు బేతి సుభాష్‌రెడ్డి ఝలక్.. ఏ పార్టీలో చేరబోతున్నారంటే..?!

హైదరాబాద్: మంత్రి కేటీఆర్‌(Minister KTR)కు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి(MLA Beti Subhash Reddy) ఝలక్ ఇచ్చారు. ఉప్పల్ భగాయత్‌లో మంత్రి కేటీఆర్ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి హాజరు కాలేదు. దీంతో ఈ విషయం చర్చానీయాంశం అవుతోంది. కొంతకాలంగా బీఆర్ఎస్ అధిష్ఠానంపై ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. మంత్రి కేటీఆర్(Minister KTR) ఉప్పల్ భగాయత్ వద్ద మూసీపై బ్రిడ్జి(Moosey Bridge) నిర్మాణానికి సోమవారం నాడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందించిన ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి దూరంగా ఉన్నారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి, బీఆర్ఎస్ ఉప్పల్ అభ్యర్థి భండారి లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పబ్లిక్ మీటింగ్‌కు మంత్రి కేటీఆర్ హాజరుకాకుండానే వెళ్లిపోయారు. టికెట్ ఇవ్వకపోవడంతోనే అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ మారే ఆలోచనలో ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి ఉన్నట్లు సమాచారం. కాగా.. కొన్ని రోజుల క్రితం సీఎం కేసీఆర్(CM KCR) అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ లిస్టులో తన పేరు ఉంటుందని భావించినా సుభాష్‌రెడ్డికి కేసీఆర్ మొండిచేయి చూపించారు. దీంతో ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అలాగే బండారు లక్ష్మారెడ్డి(Bandaru Lakshmareddy)కి తనకు కూడా కొంతకాలంగా రాజకీయ పోరు నడుస్తోంది. దీనికి తోడూ కేసీఆర్ కూడా బండారు లక్ష్మారెడ్డికే టికెట్ కేటాయించడంతో సుభాష్‌రెడ్డి తీవ్ర నిరాశలో ఉన్నారు.

నియోజకవర్గంలో బలహీనంగా ఉన్న పార్టీని అన్నీ వర్గాలకు చేరువయ్యేలా చేశానని పలువురి దగ్గర ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి వాపోతున్నారు. నియోజకవర్గంలో ఇంత చేసిన పార్టీకి తనను దూరంగా పెడుతున్నారని అనుచరుల దగ్గర తన ఆవేదనను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తన రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌(Congress)కు చేరవయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ మధ్య ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డిని కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా కలిసినట్లు విశ్వసనీయ సమాచారం. దీనికితోడూ ఉప్పల్ నియోజకవర్గంపై మొదటి నుంచి కాంగ్రెస్‌కు మంచి పట్టుంది. తన అనుచరులు కూడా పార్టీ మారితేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యేకు సూచించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో మంచి దుమ్మున్న లీడర్ పార్టీకి దూరమైతే ఈ నియోజకవర్గంలో పార్టీ బలహీన పడే అవకాశాలు ఉన్నాయని.. జంట నగరాలపై కూడా ఈ ప్రభావం పడే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-09-25T16:32:49+05:30 IST