Delhi Liquor Scam : కవిత అరెస్ట్‌పై ఊహాగానాలు.. కాసేపట్లో కేసీఆర్‌తో భేటీ
ABN , First Publish Date - 2023-03-08T10:08:53+05:30 IST
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాసేపట్లో ప్రగతి భవన్‌కు వెళ్లనున్నారు. ఈడీ నోటీసులు, విచారణపై సీఎం కేసీఆర్‌తో చర్చించనున్నారు. జంతర్ మంతర్ వద్ద ధర్నా నేపథ్యంలో ఈ సాయంత్రమే ఢిల్లీకి కవిత వెళ్లాల్సి ఉంది.
హైదరాబాద్ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాసేపట్లో ప్రగతి భవన్‌కు వెళ్లనున్నారు. ఈడీ నోటీసులు, విచారణపై సీఎం కేసీఆర్‌తో చర్చించనున్నారు. జంతర్ మంతర్ వద్ద ధర్నా నేపథ్యంలో ఈ సాయంత్రమే ఢిల్లీకి కవిత వెళ్లాల్సి ఉంది. కవిత అరెస్టుపై బీఆర్ఎస్లో ఊహాగానాలు వస్తున్నాయి. అరెస్టు అయితే ఢిల్లీ, తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు తెలిపేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవితకు నోటీసులు అందాయి. ఈ నెల 9న ఢిల్లీలో విచారణకు ఈడీ హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. కవిత బినామీనంటూ అరుణ్ రామచంద్ర పిళ్లై అంగీకరించారని ఈడీ పేర్కొంది. రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. కవిత రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్షలో ఆమె పాల్గొననున్నారు. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం కవిత నిరాహార దీక్ష చేయనున్నారు. రామచంద్ర పిళ్లైను 5 రోజుల కస్టడీ కి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అనుమతించింది.
కవిత ఢిల్లీలో ధర్నా డౌటే..
కవిత రేపు ఢిల్లీలో జరగనున్న ధర్నా కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం కవిత నిరాహార దీక్ష చేయనున్నారు. ఈ క్రమంలోనే మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం మార్చి10న జంతర్ మంతర్ వద్ద ధర్నాకు కవిత పిలుపునిచ్చారు. భారత జాగృతి ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంది. కవితకు ఈడి నోటీస్ల నేపథ్యంలో ధర్నా పై డైలమా చోటు చేసుకుంది. కేసీఆర్‌తో భేటీ, న్యాయ నిపుణులతో చర్చల తర్వాత ఢిల్లీ దీక్షపై కవిత ప్రకటన చేయనున్నారు.