Delhi Liquor Scam : ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత రియాక్షన్ ఇదీ..

ABN , First Publish Date - 2023-03-08T11:05:50+05:30 IST

ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు...

Delhi Liquor Scam : ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత రియాక్షన్ ఇదీ..

హైదరాబాద్ : ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) స్పందించారు. విచారణకు హాజరు అయ్యేందుకు సమయం కావాలని ఆమె అడుగుతున్నారు. 10 వ తేదీ తరువాత విచారణకు వస్తానని ఈడీ (ED)ని కోరుతున్నారు. ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున 9న విచారణకు హాజరు కాలేనని కవిత చెబుతున్నారు. 33 శాతం మహిళా రిజర్వేషన్ల కోసం 10 న ఢిల్లీ (Delhi)లో ధర్నాకు కవిత సన్నాహాలు చేసుకున్నారు. ఆ కార్యక్రమం తరువాత విచారణకు హాజరు అవుతానని ఈడీ అధికారులకు చెప్పినట్లు సమాచారం. కవిత విజ్ఞప్తి పై ఇంకా ఈడీ అధికారులు స్పందించలేదు.

తెలంగాణ తల వంచదు !!

ఈడీ నోటీసులపై స్పందిస్తూ కవిత ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘‘రాజకీయ రంగంలో తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్నది మా డిమాండ్. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు మహిళా సంఘాలతో కలిసి భారత్ జాగృతి ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్షను తలపెట్టింది. ఈ క్రమంలోనే మార్చి 9న ఢిల్లీలో విచారణకు రావాల్సిందిగా ఈడీ నాకు నోటీసులు జారీ చేసింది.

చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా నేను దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరిస్తాను. కానీ ధర్నా, ముందస్తు అపాయింట్‌మెంట్ల రీత్యా విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయ సలహా తీసుకుంటాను. ఇలాంటి చర్యలతో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని లొంగ తీసుకోవడం కుదరదని బీజేపీ తెలుసుకోవాలి. సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగాడుతూనే ఉంటాము. దేశ అభ్యున్నతి కోసం గొంతెత్తుతాము. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచబోదని ఢిల్లీలో ఉన్న అధికార కాంక్షాపరులకు గుర్తుచేస్తున్నాను. ప్రజల హక్కుల కోసం ధైర్యంగా పోరాటం చేస్తాము’’ అని పేర్కొన్నారు.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం.. ఎమ్మెల్సీ కవితకు నోటీసులు..

Delhi Liquor Scam : కవిత అరెస్ట్‌పై ఊహాగానాలు.. కాసేపట్లో కేసీఆర్‌తో భేటీ




Updated Date - 2023-03-08T13:18:36+05:30 IST