Share News

Revanth Reddy: కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి కౌంటర్

ABN , First Publish Date - 2023-10-26T17:22:01+05:30 IST

మంత్రి కేటీఆర్‌ ( Minister KTR ) కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.

Revanth Reddy: కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి కౌంటర్

హైదరాబాద్: మంత్రి కేటీఆర్‌ ( Minister KTR ) కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ‘‘ఆడలేక మద్దెల ఓడు అంటున్నావా డ్రామారావు..నీకు రైతులపై ప్రేముంటే నవంబర్ 2వ తేదీ లోపు రైతుబంధు డబ్బులు ఇవ్వు. నీకు వృద్ధులపై శ్రద్ధ ఉంటే నవంబర్ 2వ తేదీ లోపు ఫించన్ ఇవ్వు., నీకు ఉద్యోగులపై బాధ్యత ఉంటే నవంబర్ 2వ తేదీ లోపు అందరు ఉద్యోగులకు జీతాలు ఇవ్వు. నిన్న మేం ఎలక్షన్ కమిషన్‌కు చెప్పింది ఇదే. నీలాంటి వాడిని చూసే “నిజం చెప్పులు తొడుక్కునే లోపు... అబద్ధం ఊరంతా తిరిగొస్తుంది” అనే సామెత పుట్టింది. డ్రామాలు ఆపి... నవంబర్ 2వ తేదీ లోపు లబ్ధిదారులకు నిధులు ఇవ్వు... లేదంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచిన మొత్తంతో కలిపి ఇస్తుంది’’ అని రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు.

Updated Date - 2023-10-26T19:19:56+05:30 IST