BJP: మోదీ టూర్... సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను పరిశీలించిన తెలంగాణ బీజేపీ నేతలు
ABN , First Publish Date - 2023-04-04T11:03:17+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 8న సికింద్రాబాద్‌కు రానున్న నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఈనెల 8న సికింద్రాబాద్ (Secundrabad)కు రానున్న నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలు (Telangana BJP Leaders)ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఈరోజు ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secundrabad Railway Station)ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy), బండి సంజయ్ (Bandi Sanjay), లక్ష్మణ్ (Laxman) తదితరులు పరిశీలించారు. ఈనెల 8న ప్రధాని మోదీ (PM Modi) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే వివిధ అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించనున్న నేపథ్యంలో కేంద్రమంత్రి, బీజేపీ నేతలు ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లపై రైల్వే అధికారులతో కిషన్ రెడ్డి రివ్వ్యూ నిర్వహించి పలు సూచనలు చేశారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాని పాల్గొననున్న బహిరంగ సభ ఏర్పాట్లు చూడనున్నారు. కాగా.. మోదీ అధికారిక పర్యటనను తెలంగాణ బీజేపీ రాజకీయంగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే ఎనిమిదిన పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధానమంత్రితో బహిరంగ సభను కమలం పార్టీ ఏర్పాటు చేసింది. ప్రధాని సభ కోసం జనసమీకరణపై బీజేపీ దృష్టి సారించింది.