Harish Rao: మానసిక వికలాంగుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించొద్దు
ABN , Publish Date - Dec 25 , 2023 | 03:44 PM
కొందరు మానసిక వికలాంగుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తారని.. అది మంచి పద్ధతి కాదని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ( Tanniru Harish Rao ) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు జిల్లా కేంద్రంలోని లయన్స్ క్లబ్‌లో అభయ జ్యోతి మనో వికాస కేంద్రం ఆధ్వర్యంలో సోలార్ సిస్టమ్, మానసిక వికలాంగులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రారంభించారు.
సిద్దిపేట: కొందరు మానసిక వికలాంగుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తారని.. అది మంచి పద్ధతి కాదని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ( Tanniru Harish Rao ) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు జిల్లా కేంద్రంలోని లయన్స్ క్లబ్‌లో అభయ జ్యోతి మనో వికాస కేంద్రం ఆధ్వర్యంలో సోలార్ సిస్టమ్, మానసిక వికలాంగులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘మానసిక వికలాంగులకు ఉచిత కంప్యూటర్, సోలార్‌ను ప్రారంభించాం. మానసిక వికలాంగులకు అభయ జ్యోతి ఎంతగానో ఉపయోగ పడుతుంది. మానసిక వికలాంగులు వయస్సులో ఎంత పెద్దవాళ్లు అయిన చిన్న పిల్లలతో సమానం. దేశంలో, ఏ రాష్ట్రంలో అయిన 400, 700 కంటే ఎక్కువ పెన్షన్ ఇవ్వలేదు. గతం కేసీఆర్ ప్రభుత్వం వికలాంగులకు నాలుగు వేల పెన్షన్ ఇచ్చింది. నాలుగు వేల పెన్షన్‌ను, ఆరు వేలు ఇస్తామని చెప్పారని.. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పెన్షన్‌ను ఆరు వేల రూపాయలను పెంచి ఇవ్వాలి. మానసిక వికలాంగులకు అవసరాల కోసం నా జీతం నుంచి కొంత డబ్బులు ఇస్తాను’’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.