MLC Kavitha: బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేసింది
ABN , First Publish Date - 2023-10-26T16:05:45+05:30 IST
బీసీలకు కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) అన్యాయం చేసిందని ఎమ్మెల్యీ కల్వకుంట్ల కవిత ( MLC Kalvakuntla Kavitha ) అన్నారు.
నిజామాబాద్: బీసీలకు కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) అన్యాయం చేసిందని ఎమ్మెల్యీ కల్వకుంట్ల కవిత ( MLC Kalvakuntla Kavitha ) అన్నారు. గురువారం నాడు నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కవిత మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ పార్టీకి ఈ ఎన్నికల్లో రైతన్నలు మద్దుతు ఇవ్వకూడదు. రైతన్నలకు రైతుబంధు మాత్రమే ఆపలా?? ఎన్నికల కోడ్ చెప్పి సంక్షేమ పథకాలను ఆపేందుకు రాహుల్‌గాంధీ కుయుక్తులు పన్నుతున్నారు. నాలుగు ఓట్ల కోసం ప్రజల కడుపు కొట్టె నీచమైన దుర్మార్గానికి కాంగ్రెస్ తెరలేపింది. బీఆర్ఎస్ పార్టీ రాజకీయ సుస్థిరత సాధించింది .. రాజకీయ సుస్థిరత లోపిస్తే మన అవకాశాలు ఎత్తుకుపోయే ప్రమాదం ఉంది. బెంగుళూర్‌ని ఐటీలో క్రాస్ చేశాం .. ఐటీ హబ్‌లు వచ్చాయి .. ఇండస్ట్రీయల్ జోన్స్ కూడా వస్తాయి. తెలంగాణను కేసీఆర్ ఎంతగానో అభివృద్ధి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చూస్తే ఆ పార్టీ నేతల్లో అభద్రతా భావం కనిస్పిస్తుంది. ఆఫీసర్లను మార్చాలని, రైతుబంధు, దళిత బంధు ఆపాలని కాంగ్రెస్ అంటుంది. ఆలా అయితే కాంగ్రెస్ వాళ్ల ఇళ్లకు కరెంట్ ఆపాలి. తెలంగాణ వచ్చిన తర్వాతనే కరెంట్ వచ్చింది కదా. బీజేపీ లాగా పేర్లు మార్చి కేసీఆర్ ప్రభుత్వం పథకాలు పెట్టడం లేదు. యూపీఎస్సీ తరహా జాబ్ క్యాలెండర్ అని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఇచ్చింది. కాని దానిని ఆచరణలో పెట్టలేదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం లేదు. 2010లో ప్రవేశపెట్టిన మహిళా బిల్లులో బీసీలను చేర్చకుండా కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేసింది. అరవింద్‌ను కోరుట్లలో ఓడిస్తాం. రేవంత్‌రెడ్డి కామారెడ్డికి వచ్చిన, ఈటల గజ్వేల్‌లో పోటీ చేసిన మా పార్టీకి వచ్చిన నష్టం లేదు’’ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.