Share News

Rahul Gandhi: తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది

ABN , First Publish Date - 2023-10-20T15:57:33+05:30 IST

తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. కాంగ్రెస్‌ విజయభేరి యాత్ర (Congress Vijayabheri Yatra)లో భాగంగా రెండో రోజు శుక్రవారం ఆయన నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో పర్యటిస్తున్నారు.

Rahul Gandhi: తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది

నిజామాబాద్: తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. కాంగ్రెస్‌ విజయభేరి యాత్ర (Congress Vijayabheri Yatra)లో భాగంగా రెండో రోజు శుక్రవారం రాహుల్ గాంధీ నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ‘‘ఇవి దొరల తెలంగాణ.. ప్రజా తెలంగాణకు మధ్య జరుగుతున్న ఎన్నికలు. తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది. శాండ్, ల్యాండ్, మైన్ ఏ దందాలో చూసినా కేసీఆర్ కుటుంబం దోపిడీ కనిపిస్తుంది. నేను అబద్ధపు వాగ్దానాలు చేయడానికి ఇక్కడకు రాలేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని మాట ఇవ్వడానికి నేను ఇక్కడికి వచ్చా. రాజస్థాన్, ఛత్తీస్‌గడ్, కర్ణాటక రాష్ట్రాలల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించా. తెలంగాణలో అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తుంది’’ అని రాహుల్ గాంధీ తెలిపారు.

బీజేపీతో యుద్ధం చేస్తునందుకే నాపై కేసులు...

‘‘మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతీ నెలా మహిళలకు రూ. 2500 అందిస్తాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తాం. రైతులు, కౌలు రైతులకు ఏడాదికి రూ.15వేలు అందిస్తాం. పసుపు రైతులకు క్వింటాకు రూ.12వేలు ధర కల్పిస్తాం. గృహజ్యోతి ద్వారా ప్రతీ ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తాం. కేసీఆర్ మీ నుంచి దోచుకున్న డబ్బును సంక్షేమం రూపంలో మీకు పంచుతాం. తెలంగాణలో దొరలపాలనను సాగనంపి... ప్రజా తెలంగాణను ఏర్పాటు చేసుకుందాం. మీతో నాకున్న అనుబంధం రాజకీయ అనుబంధం కాదు.. కుటుంబ అనుబంధం.. నెహ్రూ, ఇందిరమ్మ నాటి నుంచి ఈ బంధం కొనసాగుతోంది. మహారాష్ట్ర, అస్సాం, రాజస్థాన్... మేం ఎక్కడ బీజేపీతో యుద్ధం చేస్తే.. అక్కడ ఎంఐఎం అభ్యర్థులను పోటీకి దింపుతోంది. బీజేపీతో పోరాడుతున్నందుకు నాపై కేసులు పెట్టారు.. లోక్‌సభ సభ్యత్వం రద్దు చేశారు.. ఇల్లు లేకుండా చేశారు.. నాకు ఇల్లు లేకుండా చేయగలిగారేమో కానీ... కోట్లాది భారతీయుల హృదయాల నుంచి బయటకు పంపలేరు.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం.. ప్రజా తెలంగాణ ఏర్పడటం ఖాయం’’ అని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.

Updated Date - 2023-10-20T16:04:45+05:30 IST