AP News: టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో భువనేశ్వరి
ABN , Publish Date - Mar 29 , 2024 | 02:05 PM
తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉండవల్లిలోని చంద్రబాబు (Chandrababu) నివాసంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) పూలమాల వేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె కేక్ కట్ చేశారు. ఈ సందర్బంగా భువనేశ్వరికీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ కేక్ తినిపించారు.
విజయవాడ, మార్చి 29: తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉండవల్లిలోని చంద్రబాబు (Chandrababu) నివాసంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) పూలమాల వేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె కేక్ కట్ చేశారు. ఈ సందర్బంగా భువనేశ్వరికీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ కేక్ తినిపించారు. ఈ వేడుకల్లో తెలుగు యువత రాష్ట్ర నాయకులు రవి నాయుడు, జస్వంత్, నారా ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. నిజం గెలవాలి టీమ్ ఆధ్వర్యంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
TDP MLA Candidates: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫైనల్ లిస్ట్.. గంటా పోటీ ఎక్కడ్నుంచంటే..?
1982, మార్చి 29వ తేదీన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు.. సమాజమే నా దేవాలయం.. ప్రజలే నా దేవుళ్లంటూ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా అధికార పీఠాన్ని అధిష్టించారు. దీంతో తెలుగు వాడిలోని పవర్ ఎలా ఉంటుందో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తెలిసినట్లు అయింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి వరకు అప్రతిహతంగా కొనసాగుతోన్న కాంగ్రెస్ పార్టీ పాలనకు గండి కొట్టినట్లు అయింది.
TS News: ‘ఆ పాపాలే కేసీఆర్‌కు తగిలాయి’
మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. అందులోభాగంగా సభలు నిర్వహిస్తూ.. వైయస్ జగన్ పాలన వైఖరిని ఎండగడుతున్నారు. ఇంకోవైపు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడిని జగన్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన అక్రమ అరెస్ట్‌ను తట్టుకోలేక పలువురు మరణించారు. దాంతో నిజం గెలవాలి పేరుతో ఆ యా బాధిత కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శిస్తున్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి
Komatireddy Venkatareddy: త్వరలో సినిమా థియేటర్లపై రైడ్స్.. కోమటిరెడ్డి సంచలనం
Sri Bharath: పార్టీకి దూరమైన వారు తిరిగి రావాలనుకుంటే ఆదరిస్తాం..
మరిన్నీ ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...