AP News: మున్సిపాలిటీలో అవినీతిపై కౌన్సిలర్ల పట్టు.. వాడీవేడీగా కదిరి కౌన్సిల్ మీట్
ABN , Publish Date - Jul 10 , 2024 | 03:08 PM
Andhrapradesh: జిల్లాలోని కదిరిలో కౌన్సిల్ మీట్ వాడీవేడీగా సాగింది. మున్సిపాలిటీలో అవినీతి బాగోతంపై సమగ్ర విచారణ చేపట్టాలని కౌన్సిలర్లు పట్టుబట్టారు. డీజిల్ పేరుతో రెండు కోట్లు నిధులు స్వాహా చేశారని తెలిపిన వైసీపీ కౌన్సిలర్ తెలిపారు. భూ కబ్జాలపై కౌన్సిల్ సభ్యులు నిలదీశారు.
శ్రీసత్యసాయి జిల్లా, జూలై 10: జిల్లాలోని కదిరిలో కౌన్సిల్ మీట్ వాడీవేడీగా సాగింది. మున్సిపాలిటీలో అవినీతి బాగోతంపై సమగ్ర విచారణ చేపట్టాలని కౌన్సిలర్లు పట్టుబట్టారు. డీజిల్ పేరుతో రెండు కోట్లు నిధులు స్వాహా చేశారని తెలిపిన వైసీపీ కౌన్సిలర్ తెలిపారు. భూ కబ్జాలపై కౌన్సిల్ సభ్యులు నిలదీశారు. జగనన్న కాలనీలో అవినీతి అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అజెండాలోని అంశాలు పూర్తిస్థాయిలో అవినీతిలో కురుకు పోయాయని... తిరస్కరించాలని టీడీపీ కౌన్సిలర్లు పట్టుబట్టారు. ఈ క్రమంలో అజెండాలోని అంశాలు ఆమోదం తెలపకుండా కౌన్సిల్ మీట్ ముగిసింది.
Breakingnews: ఏపీ మంత్రి మాటల దాడి... బ్లాక్ చేసేసిన కేటీఆర్
కౌన్సిల్ మీట్‌లో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ.. పట్టణ అభివృద్దే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అవినీతి, అక్రమాలను ఉపేక్షించే పరిస్థితి లేదన్నారు. వార్డుల అభివృద్ధికి అధికారులు సహకరించాలని కోరారు. పార్టీలకతీతంగా కౌన్సిలర్లకు సహకరించి వార్డులను అభివృద్ధి చేయాలన్నారు. అలా అని అవినీతి అక్రమాలకు సహకరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కౌన్సిలర్లు లేవనెత్తిన సమస్యలపై అధికారులు స్పందించాలిన్నారు. మున్సిపాలిటీలో నెలకొన్న అవినీతి, అక్రమాలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వెంకటప్రసాద్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
Rahul Dravid: రూ.5 కోట్లు నాకొద్దు.. ద్రవిడ్ నిర్ణయంపై నెటిజన్ల ప్రశంసలు
MP Purandershwari: మోరంపూడి వంతెన నిర్మాణంపై మార్గాని భరత్‌ది అబద్దపు ప్రచారం...
Read Latest AP News And Telugu News