Share News

TDP: ఎమ్మెల్యే గౌతు శిరీష న్యాయపోరాటం

ABN , Publish Date - Jul 10 , 2024 | 12:42 PM

Andhrapradesh: శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష న్యాయ పోరాటానికి దిగారు. గతంలో వైసీపీ సోషల్ మీడియా వేదికగా జరిగిన వేధింపులపై న్యాయ పోరాటం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న తన మీద తన కుటుంబం మీద రాసిన అశ్లీల , అసభ్యకర రాతలు మీద పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో శిరీష న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

TDP: ఎమ్మెల్యే గౌతు శిరీష న్యాయపోరాటం
Palasa MLA Gouthu Sririsha

విశాఖపట్నం, జూలై 10: శ్రీకాకుళం జిల్లా (Srikakulam) పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష (MLA Gouthu Sirisha) న్యాయ పోరాటానికి దిగారు. గతంలో వైసీపీ సోషల్ మీడియా వేదికగా జరిగిన వేధింపులపై న్యాయ పోరాటం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న తన మీద తన కుటుంబం మీద రాసిన అశ్లీల , అసభ్యకర రాతలు మీద పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో శిరీష న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో ఈరోజు (బుధవారం) సెకండ్ అడిషనల్ సివిల్ న్యాయస్థానానికి హాజరుకానున్నారు. దీనిపైన హోంమంత్రిని కూడా కలిసి వినతిపత్రం ఇస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఇలా వేధింపులకు గురైన వారు బయటకు రావాలని కోరుతున్నామని... అటువంటి వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే గౌతు శిరీష పేర్కొన్నారు.

Pinnelli: ఈవీఎం పగులగొట్టలేదు: పోలీసుల విచారణలో పిన్నెల్లి..


గత రెండేళ్లుగా గౌతు శిరీషపై సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలు అసభ్యకరమైన పోస్టింగ్‌లు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తూ వచ్చారు. తన ఫోటోలు మార్ఫింగ్ చేశారని శిరీష చెబుతూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసీపీ నేతలపై జాతీయ మానవ హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. అలాగే పోస్టింగ్ పెట్టిన వారిపై, పెట్టించిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటికి సంబంధించి ఆధారాలతో సహా ఇచ్చినా వైసీపీ నేతలపై పోలీసులు చర్యలు తీసుకోలేదని గౌతు శిరీష మండిపడ్డారు. చివరకు ఈ వ్యవహారానికి సంబంధించి పలాస ఎమ్మెల్యే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.


ఇవి కూడా చదవండి..

Telangana: మల్లారెడ్డికి మరో భారీ షాక్.. 15 మంది జంప్..!

Hyderabad : 10,000 కోట్లు సిద్ధం?

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 10 , 2024 | 01:42 PM