Share News

TDP: ఆ ఇద్దరు ఒక్కటైన వేళ.. కళ్యాణదుర్గం టీడీపీలో జోష్

ABN , Publish Date - Feb 21 , 2024 | 02:16 PM

Andhrapradesh: కళ్యాణదుర్గం టీడీపీలో మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, టీడీపీ ఇంచార్జి మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఒక్కటవడంతో పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. బుధవారం ఎన్టీఆర్ భవన్‌లో ఉమ్మడిగా విలేకరుల సమావేశం నిర్వహించగా.. టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు.

TDP: ఆ ఇద్దరు ఒక్కటైన వేళ.. కళ్యాణదుర్గం టీడీపీలో జోష్

అనంతపురం, ఫిబ్రవరి 20: కళ్యాణదుర్గం టీడీపీలో (TDP) వర్గపోరుకు ఎట్టకేలకు తెరపడింది. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇంచార్జి మధ్య ఆదిపత్య పోరు ముగిసింది. తామిద్దరిలో ఎవరికి టికెట్ దక్కినా ఓకే అంటూ కళ్యాణదుర్గం టీడీపీలో మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి (Former MLA Unnam Hanumantaraya Chaudhary), టీడీపీ ఇంచార్జి మాదినేని ఉమామహేశ్వర నాయుడు (TDP in-charge Madineni Umamaheswara Naidu) ఒక మాట మీదకు వచ్చారు. దీంతో కళ్యాణదుర్గం టీడీపీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది.

ఒక్కటైన నేతలు

కళ్యాణదుర్గం టీడీపీలో మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, టీడీపీ ఇంచార్జి మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఒక్కటవడంతో పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. బుధవారం ఎన్టీఆర్ భవన్‌లో ఉమ్మడిగా విలేకరుల సమావేశం నిర్వహించగా.. టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. టికెట్ ఎవరికిచ్చినా కలిసికట్టుగా పనిచేసేలా ఉన్నం హనుమంతరాయ చౌదరి, మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఒక్క తాటిపైకి వచ్చారు. ఇద్దరు నేతల కలయికతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో విభేదాల విడిచి టీడీపీ నేతలు, కార్యకర్తలు కలిసిపోయారు.

hanumanth-umamahesh.jpg

ఈ సందర్భంగా టీడీపీ ఇంచార్జి ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా ఎవరు పోటీ చేసినా అత్యధిక మెజార్టీతో గెలిపించి టీడీపీ అధినేత చంద్రబాబుకు (TDP Chief Chandrababu Naidu) కానుకగా ఇస్తామన్నారు. 40 సంవత్సరాలుగా పార్టీ కోసం రెండు కుటుంబాలు పనిచేస్తున్నాయన్నారు. వ్యాపారస్తులు టికెట్ వచ్చినట్టు క్యాడర్‌ను కన్ఫ్యూజ్ చేస్తున్నారని... పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతాలు లేవని ఉమామహేశ్వర నాయుడు పేర్కొన్నారు.

కాగా.. 2014లో కళ్యాదుర్గం నియోజకవర్గం నుంచి హనుమంతరాయ చౌదరి ఎమ్మెల్యేగా గెలవగా.. 2019 ఎన్నికల్లో హనుమంతరావు చౌదరికి టిక్కెట్ దక్కలేదు. టీడీపీ అభ్యర్థిని మార్చేసి ఉమామహేశ్వర నాయుడుని పోటీ చేయించగా.. ఆయన ఓడిపోయారు. అయితే ఈసారి టికెట్ తనకే అంటే తనకే అంటూ ఇరువురు నేతలు పోటాపోటీకి దిగారు. ఒకొనానొక సందర్భంలో కళ్యాణదుర్గం వర్గపోరు టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా కూడా మారిపోయింది. చివరకు ఇరువురు నేతలు ఒక్కొటవడంతో పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 21 , 2024 | 02:16 PM