Share News

JC Prabhakar: చంద్రబాబును కొద్దిగా వదిలిపెట్టమను... మేమేంటో చూపిస్తాం

ABN , Publish Date - Jul 24 , 2024 | 03:06 PM

Andhrapradesh: ‘‘వైసీపీపై ఐదు సంవత్సరాలు పోరాడిన వ్యక్తిని నేను.. నాపై దొంగతనం కేసులు బనాయించారు.. డీటీసీ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు రాసిన లేఖను తప్పుపట్టారు. పంజాబ్‌లో బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 గా రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై చర్యలు తీసుకున్నారు. ప్రభోదానంద ఆశ్రమం ఘటనలో నాతో పాటు రవీంద్రరెడ్డిపై

JC Prabhakar: చంద్రబాబును కొద్దిగా వదిలిపెట్టమను... మేమేంటో చూపిస్తాం
JC Prabhakar Reddy

అనంతపురం, జూలై 24: ‘‘వైసీపీపై ఐదు సంవత్సరాలు పోరాడిన వ్యక్తిని నేను.. నాపై దొంగతనం కేసులు బనాయించారు.. డీటీసీ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు రాసిన లేఖను తప్పుపట్టారు. పంజాబ్‌లో బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 గా రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై చర్యలు తీసుకున్నారు. ప్రభోదానంద ఆశ్రమం ఘటనలో నాతో పాటు రవీంద్రరెడ్డిపై అక్రమంగా కేసు బనాయించి జిల్లా బహిష్కరణ చేశారని అన్నారు. దుర్మార్గుడైన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన కుమారులను జిల్లా నుంచి బహిష్కరించాల్సిందే’’ అని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి (Tadipatri Municipal Chairman JC Prabhakar Reddy) డిమాండ్ చేశారు.

Telangana: కేసీఆర్ ఎక్కడ దాక్కున్నారు.. కేటీఆర్‌ను ఓ రేంజ్‌లో ఆడుకున్న రేవంత్..!


బుధవారం మీడియాతో మాట్లాడుతూ... రోజుకు 40 వేల లీటర్లు కర్ణాటక నుంచి అక్రమంగా డీజిల్ తరలిస్తూ పట్టుబడ్డారని తెలిపారు. పెద్దారెడ్డి కుటుంబ సభ్యులే కర్ణాటక సారా, ఇసుకను విక్రయిస్తుండటంపై కేసులు నమోదయ్యాయన్నారు. తప్పుడు రికార్డులు సృష్టించి ఆస్తులు కాజేశాడని మండిపడ్డారు. మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి ఇంటిని నిర్మించారన్నారు. చట్ట ప్రకారమే ఆ ఇంటిని మున్సిపల్ అధికారులు కూల్చివేస్తారని... తొందరలో నోటీసులు ఇస్తారని తెలిపారు. కోమటికుంట్లలో సోలార్ యాజమాన్యంను బెదరించి 480 ఎకరాలు కొడుకు పేరుతో రాయించుకున్నారన్నారు. తమ నాయకుడు లీగల్‌గా వెళ్ళమని చెప్పారని... లీగల్ గానే వెళ్తా జగన్ అని జేసీ అన్నారు. అసెంబ్లీలో ఓ తల్లిని ఏమి మాట్లాడించావో గుర్తు పెట్టుకోవాలని.. చంద్రబాబును క్షమాపణ అడుగు జగన్ అని డిమాండ్ చేశారు.

CM Chandrababu: ఆలోచన లేకుండా చట్టాన్ని తీసుకొచ్చారు.. ల్యాండ్ టైటలింగ్ బిల్లుపై చంద్రబాబు ఫైర్


‘‘చంద్రబాబును కొద్దిగా వదిలిపెట్టమను... మేమేంటో చూపిస్తాం’’ అని అన్నారు. చంద్రబాబు అభివృద్ధి అంటారని ఆయన వ్యక్తిత్వం వేరని.... చట్ట ప్రకారం వెళ్తారని అన్నారు. సీతారామాంజనేయులు, పేర్ని నాని, ప్రసాదరావు, సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసులు నమోదు చేయాలన్నారు. ఎస్పీ తప్పకుండ న్యాయం చేస్తారని నమ్మకం ఉందని తెలిపారు. ‘‘ నా కుటుంబం మొత్తం బాధ పడ్డాం. మాకు న్యాయం జరగాలి... చంద్రబాబును ఇబ్బంది పెట్టను. నాకు గన్‌మెన్ వద్దు... న్యాయం జరిగే వరకు గన్‌మెన్‌న పెట్టుకోను’’ అని స్పష్టం చేశారు. పోలీసులు పనికిమాలిన వాళ్లకు గన్‌మెన్‌లను ఇస్తున్నారన్నారు. మర్డర్ కేసులో ఉన్న రామకృష్ణారెడ్డికి, నడవ లేని మురళీధర్ రెడ్డికి గన్‌మెన్‌లను ఇచ్చారని జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు.


ఇవి కూడా చదవండి..

BJP state president: రాజకీయాల కంటే పోలీస్‌ ఉద్యోగమే మంచిది..

Kilari Rosaiah: వైసీపీకి మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య గుడ్ బై..

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 24 , 2024 | 03:10 PM